»   » జయ మొదటి పారితోషికం ఎంతో తెలుసా... నమ్మలేరు , శోభన్ బాబు ఇలా చెప్పటం ఆశ్చర్యమే

జయ మొదటి పారితోషికం ఎంతో తెలుసా... నమ్మలేరు , శోభన్ బాబు ఇలా చెప్పటం ఆశ్చర్యమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంత గొప్ప రాజకీయ నాయకురాలైనా సరే జయలలిత అనగానే కళ్లముందు కనిపించేది మొదట ఆమె సిని ప్రస్థానమే.. తెర మెద వెలుగులు చిందించడమే కాదు తనను నమ్ముకున్న వారికి అమ్మలా ఆదుకుంటూ తమిళ నాట తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించారు జయలలిత.

చిన్నప్పటి నుండే కళల మీద ఆసక్తి కలిగిన జయలలిత క్లాసికల్ మ్యూజిక్ తో పాటుగా భరత నాట్యం, మణిపురి, కథక్ లాంటివి నేర్చుకున్నారు. 1961లో జయలిత శ్రీశైల మహాత్మె సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. 1962లో కృష్ణ అనే రోల్ లో ఓ మూడు నిమిషాల డ్యాన్స్ సీక్వెన్స్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు జయలలిత.

జయలలిత కోసం శోభన్ బాబు తపించాడు... కానీ చివరకు ఏమైందంటే?

చిన్న చిన్న వేశాలతో కెరియర్ ప్రారంభించిన ఆమె సినిమా కెరియర్ ఆ తర్వాత ఊపందుకుంది. తను సినిమాల్లో మొదట పారితోషికంగా 3000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆరోజుల్లో 3000 పారితోషికం అంటే మామూలేం కాదు.ఒక మోస్తరు హీరోల పారితోషికాలే 20, 000, 30,000, గా ఉన్న రొజులవి, అలాంటిది కెరీర్ మొదలవగానే 3000 అందుకోవటం మామూలేం కాదు.

Jayalalitha's Remunaration When she was enterd in to filim industry was 3000

లాయర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నా షూటింగుల వల్ల కాలేజ్ కు సరిగా వెళ్లలేకపోయే వారు. 1964లో అండర్ సెక్రెటరీ అనే డ్రామాలో ఆమె సేల్స్ గర్ల్ పాత్రలో నటించారు. ఇక అదే సంవత్సరం కన్నడ సినిమా చిన్నడ గాంబే లో లీడ్ రోల్ గా నటించారు. తెలుగులో జయలలిత మొదటి సినిమా మనుషులు మమతలు.

ఏయన్నార్ హీరోగా నటించిన ఆ సినిమాలో జయలలిత నటన అందరిని ఆకట్టుకుంది. తమిళ నటుడు జయశంకర్ చాలా సినిమాల్లో నటించారు. ఇక తమిళ నట దిగ్గజం ఎం.జి.ఆర్ తో 10 సినిమాల దాకా నటించారు. శివాజి గణేషన్ కు కూడా ఆపోసిట్ గా నటించి మెప్పించారు జయలలిత. తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు లతో చాలా సినిమాల్లో నటించారు జయలలిత.

శోబన్ బాబు తో జయలలితతో నటించినది కొన్ని చిత్రాలే అయినా, హీరో శోభన్ బాబుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని గతంలో శోభన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను నటుడిగా అవకాశాలు పొందే నాటికే జయలలిత పెద్ద స్టార్ అని, ఆమెతో నటించాలని ఎనిమిదేళ్లు ఎదురుచూశానని చెప్పుకున్నారు. ఆమెను చూడాలని తపించే వాడినని, ఓ రకంగా తపస్సే చేశానని గుర్తు చేసుకున్నారు.

English summary
It is a well known fact that Tamil Nadu Chief Minister Jayalalitha's Remunaration When she was enterd in to filim industry was 3000 for a movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu