»   » జయ లలిత నటించిన తెలుగు సినిమాలు ఇవే!

జయ లలిత నటించిన తెలుగు సినిమాలు ఇవే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జయలలిత సినిమా రంగానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రికే పరిమితమైన జయలలిత సోమవారం రాత్రి కన్నుమూసారు.

  అప్పట్లో తమిళంలో స్టార్ గా వెలుగొందుతున్న ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించిన జయలలిత... ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ మరణం తరువాత ఆయన వారసురాలిగా ప్రకటించుకున్న జయలలిత .... జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు.

  జయలలిత అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు, ఈ పరిణామాలతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

  మకుటం లేని మహారాణిగా

  మకుటం లేని మహారాణిగా

  రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో జయలలిత నటించారు. 1961 నుంచి1980 వరకు ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. నాట్యంలో కూడా ఆమెది అందెవేసిన. తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొంతకాలం పాటు ఏలారు.

  జయ లలిత బాల్యం

  జయ లలిత బాల్యం

  జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.

  15వ ఏట సినిమా రంగలోకి

  15వ ఏట సినిమా రంగలోకి

  కుటుంబ పరిస్థితుల వల్ల తల్లి బలవంతంతో తన 15వ యేట జయలలిత సినిమా రంగములోకి ప్రవేశించారు. జయలలిత తొలి సినిమా ‘చిన్నడ గొంబె' అనే కన్నడ చిత్రం. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్.

  తొలి తెలుగు సినిమా

  తొలి తెలుగు సినిమా

  జయలలిత తొలి తెలుగు సినిమా ‘మనుషులు మమతలు'. ఈ సినిమా తర్వాత జయలలిత స్టార్ హీరోయిన్ అయ్యారు.

  60ల్లో జయలలిత నటించిన తెలుగు సినిమాలు

  60ల్లో జయలలిత నటించిన తెలుగు సినిమాలు

  మనుషులు మమతలు (1965)
  కథానాయకుని కథ (1965)
  ఆమె ఎవరు? (1966)
  ఆస్తిపరులు (1966)
  కన్నెపిల్ల (1966)
  గూఢచారి 116 (1966)
  నవరాత్రి (1966)
  గోపాలుడు భూపాలుడు (1967)
  చిక్కడు దొరకడు (1967)
  ధనమే ప్రపంచలీల (1967)
  నువ్వే (1967)
  బ్రహ్మచారి (1967)
  సుఖదుఃఖాలు (1967)
  అదృష్టవంతులు (1968)
  కోయంబత్తూరు ఖైదీ (1968)
  తిక్క శంకరయ్య (1968)
  దోపిడీ దొంగలు (1968)
  నిలువు దోపిడి (1968)
  పూలపిల్ల (1968)
  పెళ్ళంటే భయం (1968)
  పోస్టుమన్ రాజు (1968)
  బాగ్దాద్ గజదొంగ (1968)
  శ్రీరామకథ (1968)
  ఆదర్శ కుటుంబం (1969)
  కథానాయకుడు (1969)
  కదలడు వదలడు (1969)
  కొండవీటి సింహం (1969)
  పంచ కళ్యాణి దొంగల రాణి (1969)

  70ల్లో జయలలిత నటించిన సినిమాలు

  70ల్లో జయలలిత నటించిన సినిమాలు

  ఆలీబాబా 40 దొంగలు (1970)
  కోటీశ్వరుడు (1970)
  గండికోట రహస్యం (1970)
  మేమే మొనగాళ్లం (1971)
  శ్రీకృష్ణ విజయం (1971)
  శ్రీకృష్ణసత్య (1971)
  భార్యాబిడ్డలు (1972)
  డాక్టర్ బాబు (1973)
  దేవుడమ్మ (1973)
  దేవుడు చేసిన మనుషులు (1973)
  లోకం చుట్టిన వీరుడు (1973)
  ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974)

  English summary
  This is the filmography of former Indian actress Jayalalitha who has acted in over 140 films. It was only in the year 2001, that an additional letter 'a' was added to the spelling of her name due to numerological reasons
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more