»   » జయం రవి పై 350 కోట్ల బడ్జెట్టా..? తెలుగు బాహుబలిని బీట్ చేయాలనేనా ఈ ప్రయత్నాలన్నీ

జయం రవి పై 350 కోట్ల బడ్జెట్టా..? తెలుగు బాహుబలిని బీట్ చేయాలనేనా ఈ ప్రయత్నాలన్నీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా ఒక్క సారి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపింది. అన్ని వుడ్ ల సినీ జనాలూ ఉలిక్కి పడ్డారు రాజమౌళి అన్న పేరు తలవని సినిమా మనిషి లేడనే చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలోనూ భారత్ వంటి దేశం లో వచ్చిన ఒక ప్రాంతీయ భాషా చిత్రం పై అనేక చర్చలు చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కొచ్చి పడింది లెండి అదీ మనకు కాదు లెండి. తమిళ ఇందస్ట్రీకి బాహుబలి వచ్చిన దగ్గర్నుంచీ పాపం కోలీవుడ్ కి కంటినిండా నిద్ర కరువయ్యింది. ఎలా అయినా బాహుబలి ని బీట్ చేసే సినిమా తీసేయాలనే పట్టుదల తో ఉన్నారు.

మొన్నటి వరకు బాలీవుడ్ పిక్చర్స్ వందల కోట్లతో తీసేవారు.నెమ్మదిగా అదే క్లబ్ లోకి కోలీవుడ్ అడుగు పెట్టింది శంకర్ తీసిన రోబో, కబాలి వంటి సినిమాలు సౌత్ మూవీస్ రేంజ్ ను పెంచేశాయి. అయితే టాలీవుడ్ ఆ క్లబ్ లో చేరటానికి చాలా సమయమే పట్టింది కానీ ఒక్క సారే ఆ పాత రికార్డులన్నిటినీ కనీసం దశాబ్దం అనుభవం కూడా లేని ఇద్దరు కుర్ర హీరోలతో కలిసి తొక్కి పడేసాడు రాజమౌళి అనే ఒక సూపర్ తెలుగు డైరెక్తర్. బాహుబలి దుమారానికి కళ్ళలో దుమ్ము పడ్డ కోలీవుడ్ ఇప్పుడు ఒళ్ళువిరుచుకున్నారు ఇప్పుడు కోలీవుడ్ లో చాలామంది కల ఒకటే అదేంటంటే అర్జంట్ గా బాహుబలి కంటే పెద్ద సినిమా తీసేయాలి.బడ్జెట్ కూడా భారీగానే ఉండాలి అదన్న మాట సంగతి.

Jayam Ravi likely to star in Sundar.c's "Sanghamitra"

అందుకే విజయ్ హీరోగా పెట్టి "పులి" అనే సినిమాని తీసారు. పాపం ఈ అరవపులి అరవటం కాదు కదా కనీసం మూలగను కూడాలేదు, బాహుబలికి ఎదురుకూడా పడలేక సిగ్గుతో పారిపోయి ఎక్కడో దాక్కుంది. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఊపేస్తుంది చూడండీ అంటూ రజినీకాంత్ తో కబాలీ తీసుకొచ్చి హంగామా చేసినా బాహుబలి మాత్రం కదలకుండా అదే ధీమాతో నిలబడ్డాడు. ఇది మరీ పుండు మీద కారం చల్లిన ఎఫెక్ట్ ఇవ్వటం తో ఇప్పుడు కాస్త తీవ్రంగానే తమ ప్రయత్నాలని మొదలు పెట్టారు తమిళ దర్శకులు.

ఇప్పుడు కుష్బూ భర్త అయిన సుందర్ సీ 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తీద్దామని ప్లాన్ చేసి దాని కోసం మహేష్ బాబు ని అడిగాడు. అయితే ఈ ఆఫర్ ని అంగీకరించకుండా 30 కోట్ల రెమ్యున రేషన్ ని కూడా తిరస్కరించేసాడు మహేష్. కథమీద నమ్మకం లేకపోవటమే కారణం అని కూడా చెప్పుకున్నారు. అంతే కాదు వరుసగా రెండేళ్ళ డేట్స్ అడిగాడట సుందర్, దాంతో మహేష్ ఇంకో ఆలోచన లేకుండా నో అనేసాడు. ఇక తమిళ ఇండస్ట్రీలోనే ఒక టాప్ హీరో విజయ్ ని ట్రై చేసినా "పులి" అనుభవం గుర్తొచ్చి తూచ్... నేను చెయ్యను అని చెప్పేయటం తో ఇప్పుడు ఆ ఆఫర్ జయం రవి ని చేరింది.

Jayam Ravi likely to star in Sundar.c's "Sanghamitra"

కథ ప్రకారం ఇద్దరు హీరోలు కావాల్సి ఉండతం తో ఆ రెండో పాత్రకోసం ఆర్య ని తీసుకున్నాదట. మంచి ఇమేజ్ ఉన్న హీరో అయితే పక్కాగా బిజినెస్ అవుతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడైతే స్టార్ హీరోస్ తో పెద్ద సినిమాలు చేసాడు కాని ఈ మధ్య చంద్రకళ, శశికళ లాంటి నాసి రకం హారర్ సినిమాలతో తన స్థాయి తగ్గించుకున్నాడు సుందర్. మరి ఎందుకు నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడానికి రెడీ అయింది తేన్ద్రల్ ఫిలిమ్స్ అనేది అర్థం కావటం లేదు. 11 దేశాల్లో షూటింగ్ జరుపుకోబోతున్న తొలి భారతీయ సినిమా ఇదే నట. ఏఆర్ రెహ‌మాన్, సాబు సిరిల్, సుదీప్ చటర్జీ లాంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తారట. మొత్తానికి ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు చూడాలి ఏం జరుగుతుందో... తమిళ బాహుబలులు ఎంత వరకూ సక్సెస్ అవుతారో.

English summary
Jayam Ravi, who is currently busy wrapping up Bogan, is tipped to star in filmmaker Sundar C's Tamil historical fantasy film Sanghamitra.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu