»   »  జయం రవి, లక్ష్మిమీనన్ నటించిన హర్రర్ మూవీ తెలుగులో...

జయం రవి, లక్ష్మిమీనన్ నటించిన హర్రర్ మూవీ తెలుగులో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సక్సెస్ ఫుల్ హీరో జయం రవి, లక్ష్మిమీనన్ కలిసి నటించిన తమిళ సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం "మిరుథన్" తెలుగు డబ్బింగ్ అండ్ రీమేక్ రైట్స్ ని లక్ష్మిప్రసన్న గారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Jayam Ravi Miruthan Movie in Telugu

వివరాల్లోకి వెళ్తే:
సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన తమిళ హీరో జయం రవి, లక్ష్మిమీనన్ కలిసి మొదటిసారిగా నటించిన సూపర్ నేచురల్ హర్రర్ మూవీ మిరుథన్. తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ అవుతున్న తమిళ చిత్రం "తనిఒరువన్", జయం రవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత జయం రవి నటించిన మరో మూవీ మిరుథన్. లక్ష్మీమీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సూపర్ నేచురల్ హర్రర్ మూవీ తెలుగు డబ్బింగ్ అండ్ రీమేక్ హక్కులను లక్ష్మిప్రసన్న గారు సొంతం చేసుకున్నారు.

ఈ చిత్రానికి ఎంతోమంది పోటీపడినా చివరికి డబ్బింగ్ అండ్ రమేక్ హక్కులు ఫ్యాన్సీ రేటుకి లక్ష్మిప్రసన్న గారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్రవరి 12 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా మిరుథన్ మూవీ తెలుగు వర్షన్ ఆడియో, ట్రైలర్ అండ్ టైటిల్ లోగోలను త్వరలోనే ఆవిష్కరించనున్నారు.

English summary
Jayam Ravi Miruthan Movie releasing in Telugu. 'Miruthan' directed by Shakti Soundarrajan has received a great appreciation from audience after the release in Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu