»   » ఆరేళ్ల తర్వాత మేకప్‌ వేసుకోనున్న జయప్రద : నీటిసమస్య మీద సినిమా పోరాటం

ఆరేళ్ల తర్వాత మేకప్‌ వేసుకోనున్న జయప్రద : నీటిసమస్య మీద సినిమా పోరాటం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు తెరను కొన్ని దశాబ్దాల పాటు ఏలి.. ఇక్కడి నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా రాజ్యమేలి.. తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద.. మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరమీద దర్శనం ఇవ్వబోతున్నారు. పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేశారు జయప్రద.

చిన్న వయసులో పెళ్లి

చిన్న వయసులో పెళ్లి

పెళ్లి కూడా చిన్న వయసులోనే జరిగిపోయింది. ఇరవైనాలుగేళ్లన్నది పెళ్లికి చిన్న వయసేం కాదు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న ఒక స్టార్‌ నటికి అది బాల్య వివాహం కిందే లెక్క జయప్రద తొలి సినిమా ‘భూమికోసం'. ఆ తర్వాత జయప్రద నటించిన పెద్ద సినిమా ‘అంతులేని కథ.

భూమికోసం

భూమికోసం

అప్పుడు ఆమె వయసు పదిహేనేళ్లు, ఆ చిత్రంలో చెల్లి చంద్రమ్మగా చిన్న వేషం వేశారు జయప్రద. తొలిషాట్‌ నెల్లూరులో. పొలాల మధ్య నుంచి తలపై బుట్ట పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటుంది. ఆ సినిమాకు ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్‌ పది రూపాయలు. ఆతర్వాత కొన్నాళ్ళకి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగి.. బాలీవుడ్ కీ వెళ్ళింది.

మలయాళ చిత్రంలో

మలయాళ చిత్రంలో

కొన్నేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఓ మలయాళ చిత్రం ద్వారా తిరిగి మేకప్‌ వేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకోసం ఆమె కేరళ రాజధానికి కూడా చేరుకున్నారు. దర్శకుడు ఎంఏ నిషాద్‌ తీయబోతున్న కిన్నారు(మంచి) అనే మలయాళ చిత్రంలో జయప్రద ప్రస్తుతం నటించబోతున్నారు.

నీటి , రైతుల సమస్యలు ఇతివృత్తంగా

నీటి , రైతుల సమస్యలు ఇతివృత్తంగా

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలయాళ చిత్రం ద్వారా తిరిగి నటనను ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తాను నటించబోతున్న ఈ సినిమాలో సామాజిక సమస్య అయిన నీటి సమస్య, రైతుల సమస్యలు ఇతివృత్తంగా ఉండబోతుందని చెప్పారు. 2011లో ఆమె మలయాళంలో ప్రణయం అనే చిత్రం చేశారు. ఆ చిత్రంలో ఆమెతోపాటు మోహన్‌లాల్‌ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కూడా నటించారు.

English summary
Popular actress-politician Jayaprada is back in a Malayalam film after a gap of six years.The actress is now in the state capital for her latest Malayalam film "Kinnaru", directed by M.A. Nishad, known for offbeat films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu