»   » ఆ సూపర్ హిట్ రీమేక్ లో నటిస్తూ నిర్మిస్తున్న జయప్రద

ఆ సూపర్ హిట్ రీమేక్ లో నటిస్తూ నిర్మిస్తున్న జయప్రద

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ నటి జయప్రధ నిర్మాతగా మారి ఓ రీమేక్ చిత్రం అందించనున్నారు. ఆ రీమేక్ మరేదో కాదు..తెలుగులో సూపర్ హిట్ అయిన 'మాతృదేవోభవ'. అయితే ఈ చిత్రాన్ని ఆమె భోజపురి భాషలో నిర్మిస్తూ కీ రోల్ లో నటిస్తున్నారు. ఆమెకు విపరీతంగా నచ్చిన ఈ చిత్రం గ్యారింటీగా ఘన విజయం సాధిస్తుందని ఆమె భావిస్తున్నారు. తెలుగులో మాధవి చేసిన పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ చిత్రం రీమేక్ హక్కులను కేఎస్ రామారావు నుంచి ఆమె పొందారు. 1993 లో కె.అజయ్ కుమార్ దర్సకత్వంలో ఈ చిత్రాన్ని కె.ఎస్ రామారావు నిర్మించారు.


ఇక ఇటీవల కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలు చేసిన ప్రస్తుతం భోజ్‌పురి భాషలో ఆమె ఒక చిత్రంలో నటించబోతున్నారు. తెలుగు తెరపై కన్నీటి వర్షాన్ని కురిపించిన 'మాతృదేవోభవ'కు రీమేక్ ఇది. అమ్మా నాన్న.. నలుగురు పిల్లలలు చుట్టూ సాగే కథ ఇది. తండ్రి హత్యకు గురవుతాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తల్లిని కేన్సర్ మహమ్మారి ఆక్రమిస్తుంది. చనిపోయేలోపు నలుగురు పిల్లలను దత్తత ఇవ్వడానికి ఆ తల్లి పడే ఆరాటం అందరి కంట తడిపెట్టించింది.

దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచినా 'మాతృదేవోభవ' చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...' పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అంతగా ప్రేక్షకుల్ని హత్తుకున్న ఈ చిత్రంలో మాధవి అద్భుతంగా చేసిన పాత్రను జయప్రద చేయబోతున్నారు. నాజర్ పాత్రను భోజ్‌పురిలో ప్రముఖ నటుడైన మనోజ్ తివారీ చేయబోతున్నారు. దినకర్ కపూర్ దర్శకత్వంలో జయప్రద నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ఆరంభం కానుంది. ఇది కాకుండా భవిష్యత్తులో జయప్రద మరిన్ని చిత్రాలు నిర్మించాలనుకుంటున్నారు. అందుకని ముంబయ్‌లోని జుహూలో ఆఫీస్ ఆరంభించారని, గుర్గావ్‌లో ఇల్లు తీసుకున్నారని సమాచారం.

English summary
After almost twenty years, Matru Devo Bhava film will now be remade in Bhojpuri. Jayaprada is going to play the lead role in the film and she's also going to produce the film. Leading Bhojpuri actor Manoj Tiwari has been finalized to play the lead role opposite Jayaprada. Dinkar Kapoor is going to direct this film. After her active role in politics, Jayaprada is planning to make a strong comeback in films and she's planning to produce more films in future.
Please Wait while comments are loading...