Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
విజువల్ వండర్ సువర్ణసుందరి.. బాహుబలి రేంజ్‌లో..
టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలకి విశేషమైన ఆదరణ చూరగొంటోంది. ఆ నేపధ్యంలో అద్భుతమైన కంటెంట్, అమేజింగ్ గ్రాఫిక్స్ తో ఎపిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం "సువర్ణసుందరి". పునర్జన్మల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలకపాత్ర పోషిస్తుండగా.. ఆమెకు తల్లిగా పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి విశేషమైన స్పందన లభించగా.. ఆగస్ట్ లో ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

బాహుబలి రేంజ్‌లో వీ ఎఫ్ ఎక్స్
"బాహుబలి, భజరంగీ భాయిజాన్" చిత్రాలకి వర్క్ చేసిన వి.ఎఫ్.ఎక్స్ టీం "సువర్ణసుందరి" చిత్రానికి కూడా వర్క్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకొంది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు మా టీం అందరం కృషి చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

కృష్ణ దేవరాయల స్టోరీతో
సూర్య ఎంఎస్ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ కృష్ణ దేవరాయల స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్నట్టు సమాచారం. చరిత్ర భవిష్యత్‌ని వెంటాడుతోంది అనే ట్యాగ్ లైన్‌తో విజువల్ ఫీస్ట్‌గా మూవీ రూపొందుతుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.

సూర్య టేకింగ్ పక్కన పెడితే
సూర్య టేకింగ్‌ను పక్కనపెడితే.. ఎల్లుమహంతి సినిమాటోగ్రఫి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకొంటున్నారు. సాయి కార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనేది ఇన్‌సైడ్ టాక్. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న సువర్ణ సుందరి సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నది.

నటీనటులు, సాంకేతికవర్గం
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరీ, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ , రామ్, ఇంద్ర తదితరులు నటిస్తున్నారు. ఎడిటింగ్ ప్రవీణ్ పుడి, ఎస్ టీమ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎల్ లక్ష్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్లు మహంతి, సంగీతం: సాయి కార్తీక్, దర్శకత్వం: ఎం.ఎస్.ఎన్. సూర్య