twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గౌరవం కోల్పోయాడు: రాజేంద్రప్రసాద్‌పై జయసుధ వ్యాఖ్య

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ చేతిలో జయసుధ 85 ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓటమిని ముందు ఊహించిన జయసుధ కౌటింగుకు కూడా హాజరు కాలేదంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అసలు మురళీమోహన్ మీద వ్యతిరేకతే జయసుధ ఓటమికి కారణమైందంటూ పలువురు ‘మా' సభ్యులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో నటి జయసుధ మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన రాజేంద్రప్రసాద్ కు అభినందనలు తెలిపారు. రాజేంద్రప్రసాద్ మాదిరి తాను ప్రచారం చేయలేక పోయానని, అయినప్పటికీ తాను 150 ఓట్లు సాధించానని జయసుధ చెప్పుకొచ్చారు.

    తన గురించి మాట్లాడేటపుడు రాజేంద్రప్రసాద్ ఇంకా కామెడీ చేష్టలు చేస్తున్నాడని, అలా చేయడం ద్వారా గౌరవం కోల్పోయాడని జయసుధ విమర్శించారు. ఎవరూ గెలిచినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభ్యున్నతికి తోడ్పడాలన్నదే తన కోరిక అని జయసుధ చెప్పుకొచ్చారు.

     Jayasudha about Rajendra Prasad

    మా ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకుగాను, 394 ఓట్లు పోలయ్యాయి.
    అధ్యక్షుడు: గద్దె రాజేంద్రప్రసాద్... 85 ఓట్లతో ఆధిక్యం విజయం
    ఉపాధ్యక్షులు: మంచు లక్ష్మి (ఏకగ్రీవం)
    కార్య నిర్వాహక కార్యదర్శి : తనికెళ్ల భరిణి...165 ఓట్లతో విజయం(జయసుధ ప్యానెల్)
    ప్రధాన కార్యదర్శి: శివాజీ రాజా... 36 ఓట్ల ఆధిక్యంతో విజయం (రాజేంద్రప్రసాద్ ప్యానెల్)
    కోశాధికారి : పరుచూరి వెంకటేశ్వరరావు... 159 ఓట్లతో విజయం (జయసుధ ప్యానెల్)
    జాయింట్ సెక్రటరీలు: నరేష్, రఘుబాబు (జయసుధ ప్యానెల్)
    ఎగ్జిక్యూటివ్ కమిటీ: బెనర్జీ, బ్రహ్మాజీ, చార్మి, రాజేశ్వర్, ఏడిద శ్రీరామ్, గీతాంజలి, హరినాథ్ బాబు, హేమ, జాకీ, జయలక్ష్మి, కాదంబరి కిరణ్, నర్సింగ్ యాదవ్, రాజీవ్ కనకాల, శ్రీ శశాంక, విద్యాసాగర్ తదితరులు

    English summary
    “Congratulations to actor Rajendra Prasad for his win. I’ve got defeated because I’ve not campaigned from a long time like him." Jayasudha said. She lashed out at the actor, saying that he is making fun of her. “He is still doing comedy for being a comedian, and that makes him lose respect”, she adds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X