»   » జయప్రద ని చూస్తూ... నవ్వుకుంటూనే మైమరిచి పోతారు (వీడియో)

జయప్రద ని చూస్తూ... నవ్వుకుంటూనే మైమరిచి పోతారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడంటే వయసు మీద పడింది గానీ ముప్పయ్యేళ్లకి ముందు అప్పటి తరం కుర్రాళ్ళకి జయప్రద హాట్ హీరోయిన్. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళి సక్సెస్ అయిన ఒకరిద్దరు హీరోయిన్లలో జయప్రధ ఒకరు. అప్పట్లో ఇటు తెలుగు అటు హిందీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్న జయప్రద ఇప్పుడు మళ్ళీ ఒక సారి ఇంటర్నెట్ లో దుమ్ము రేపుతోంది. 'మవాలి'లో తన వయ్యారాలతో కుర్రకారును హీటెక్కించింది జయప్రద.. ఆసినిమా లో జయప్రద చేసిన ఒక పాట ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.

చుట్టాలున్నారు జాగ్రత్త

చుట్టాలున్నారు జాగ్రత్త

1980వ సంవత్సరంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన 'చుట్టాలున్నారు జాగ్రత్త' కె. బాపయ్య దర్శకత్వంలో హిందీలో జితేంద్ర, జయప్రద హీరో హీరోయిన్స్‌గా 'మవాలి' పేరుతో రీమేక్ అయి ఆకాలానికి తగ్గట్టు పెద్ద విజయాన్నే అందుకుంది. తెలుగులో శ్రీదేవి చేసిన పాత్రని హిందీ రీమేక్ లో జయప్రద చేసింది .

మవాలి

మవాలి

బప్పిలహరి సంగీతాన్నందించిన 'మవాలి'లో జితేంద్ర-జయప్రద రొమాంటిక్ సాంగ్.. 'ఓయి అమ్మ ఓయి అమ్మ..' బాగా పాపులరయ్యింది. తెలుగులో "ఎన్టీఆర్ శ్రీదేవి "వేటగాడు లో ఆకు చాటు పిందె" రెంజ్ లో ఇప్పటికీ రొమాంటిక్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిందీ పాట.

ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది

ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది

అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ సాంగ్.. ఇప్పుడు కాస్త కొత్తదనాన్ని అద్దుకొని ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఈ పాటను తీసుకుని ఇప్పుడు విట్టీ ఫీడ్ ఇండియా అనే ఎంటర్టయిన్మంట్ సంస్థ.. కాస్త క్రియేటివిటీ తో మిక్స్ చేసి వదిలిన పాట రెండ్రోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

అటు ట్విటర్ లోనూ

అటు ట్విటర్ లోనూ

ఇటు ఫేస్బుక్ లోనూ పాప్ ట్రాక్ కి మన బాలీవుడ్ స్టెప్స్ హిలేరియస్ గా ఉన్నాయి.. నిజానికి ఒక కామెడీ టచ్ ఉంటుందని చేసినట్టున్నారు గానీ... అది ఇప్పుడు ఇంకో టర్న్ తీసుకొని జయప్రద ఫ్యాన్స్ ని పిచ్చి ఆనందం లో ముంచెత్తుతోంది. అర్రే.. జయప్రద ఇంత అందంగా ఉండేదా అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చూసేస్తున్నారు.

క్రియేటివ్ థింగ్ ఏమిటీ

ఇంతకీ ఆ క్రియేటివ్ థింగ్ ఏమిటీ అంటే ఆస్ట్రేలియన్ సియాఫర్లర్ అనే . 'దిస్ ఈజ్ యాక్టింగ్' అంటూ రూపొందించిన ఆల్బమ్‌లో.. సూపర్ హిట్ ట్రాక్ చీప్ థ్రిల్స్ తో 'మవాలి' సాంగ్ వీడియోకి మిక్స్ చేసి నెట్లోకి వదిలారు. ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన ఈ గీతం..

తెగనవ్వుకుంటూనే

ఇప్పటి జెనరేషన్ మ్యూజిక్‌కు మ్యాచ్ అయి సోషల్ నెట్ వర్క్‌లో హల్ చల్ చేస్తుందన్నమాట. పాటలో జయప్రద, జితేంద్రా స్టెప్ లు చూసి తెగనవ్వుకుంటూనే... ఇప్పటికీ జయప్రద అందాలకు సాహో అంతున్నారు ఇండియన్ నెటిజన్స్ ఓసారి ఆవీడియో మీరుకూడా చూసేయండి మరి....

English summary
Bollywood actor, Jeetendra, famously known as Jumping Jack celebrated his birthday recently. Watch this parody video of one of his songs with Sia's foot-tapping number, Cheap Thrills.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu