twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌ చరణ్‌ సారీ చెప్పాలంటూ రాజశేఖర్‌ డిమాండ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇటీవల ఇద్దరు వ్యక్తులపై దాడి వ్యవహారంలో చిరంజీవి కుమారుడు, యువ హీరో రామ్‌చరణ్‌ తేజ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా వారు పట్టుబట్టారు. సినీ జంట రాజశేఖర్‌, జీవిత గురువారం మెగాస్టార్‌, కేంద్ర మంత్రి కె.చిరంజీవిపై విమర్శలు గుప్పించారు.

    శ్రీకాళహస్తి దేవాలయం వద్ద వారి కుమార్తెలతో కలసి రాహు, కేతు పూజలు నిర్వహించిన అనంతరం ఉభయులూ మీడియాతో మాట్లాడారు. రామ్‌చరణ్‌ తేజ భద్రతా సిబ్బంది పట్టపగలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేయటం పట్ల తీవ్రమైన అభ్యంతరం తెలిపారు. యువ హీరో బేషరతుగా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.

    ''అభిమానులు అనే వాళ్ళు ఉంటేనే ఒక హీరో లేకుంటే సినీ పరిశ్రమ మనుగడ సాగిస్తుంది. ఆ సంఘటన అవాంఛనీయమైనది. ఎవరికీ మంచిది కాదు'' అని రాజశేఖర్‌ అభిప్రాయపడ్డారు.

    అనంతరం చిరంజీవిపై విమర్శలు చేశారు. పార్టీలో ఆయన(చిరంజీవి) చేరికతో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదని రాజశేఖర్‌ పేర్కొన్నారు. ''ఒక కులం పేరుతో లబ్ది పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు'' అని రాజశేఖర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఒక కార్యకర్తగా మాత్రమే పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

    సినీ నటులు రాజకీయాల్లో విజయం సాధించలేరంటూ కొందరు నేతల వ్యాఖ్యలకు సంబంధించి అలాంటి వ్యాఖ్యలను తాను సమర్ధించనని చెప్పారు. ''దివంగత ఎన్టీ రామారావు, ఎవ్జీుఆర్‌, అంతెందుకు ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత లాంటి సినీ నటులు విజయవంతమైన నేతలుగా రాణించారు'' అని రాజశేఖర్‌ పేర్కొన్నారు.

    English summary
    Jeevitha , Rajashekhar Demands sorry from Ramcharan. Rajashekar says that fans are most importent to Hero's.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X