For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జీవిత-రాజశేఖర్ లవ్ స్టోరీ...ఇదీ అసలు సంగతి!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సినీ నటులు, దంపతులు రాజశేఖర్, జీవిత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వాలంటైన్స్ డే సందర్భంగా ఇద్దరూ ప్రముఖ సాక్షికి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తమ ప్రేమ గురించిన వివరాలు చెప్పుకొచ్చారు. రాజశేఖర్ చదివింది మెడిసిన్ అయినా సినిమాలపై ఇష్టంతో ఇటు వైపు అడుగులు వేసారు. ఈ క్రమంలో జీవితతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

  ఈ ఇద్దరూ తలంబ్రాలు చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. ఇందులో రాజశేఖర్ నెగెటివ్ రోల్ చేయడం విశేషం. అయితే వ్యక్తిగతంగా నా తీరు అందుకు పూర్తిగా భిన్నం అంటున్నారు రాజశేఖర్. పెద్దగా అమ్మాయిలతో మాటాడేవాడిని కాను. అప్పటికే మెడిసిన్ కంప్లీట్ చేసి సినిమాలంటే ఇష్టం కొద్దీ తెరపైకి వచ్చాను. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పేశాను కూడా. యాక్టింగ్ తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. కానీ జీవితతో పరిచయం తన నిర్ణయం మార్చుకునేలా చేసింది. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అన్నారు రాజశేఖర్.

  జీవిత మాటలు చూస్తుంటే మాత్రం....రాజశేఖర్ ను దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినట్లు స్పష్టమవుతోంది. అతన్ని నాకు తెలియకుండానే ఇష్టపడేదాన్ని. అతను వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రమేం.. నేను ప్రేమించకూడదని ఏమైనా ఉందా అని ప్రశ్నించేటంత ఇష్టం ఉండేది. మామూలుగా ఉండే నేను కావాలనుకున్న దాని గురించి ఎంత వరకైనా వెళ్తానని అలా అర్ధమైంది. నా ఇష్టం అతనికి నచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం పెళ్లితో ముడిపడింది అంటున్నారు జీవిత.

  Jeevitha-Rajasekhar love story

  ఆమె నన్ను ప్రేమించింది. నేను దొరికిపోయాను.. ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే ఉంది. ఆ శక్తి ఎంత గొప్పదనిపిస్తుంది. తను నేనంటే ప్రాణం పెడుతుంది. నాకోసం ఎంతో చేస్తుంది. సర్దుకుపోతుంది. నాకు కోపం ఎక్కువ. మగాళ్లో కనిపించే ఇగో నాలో కూడా ఉంది. కొన్ని సార్లు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లాక కూడా సీరియస్‌గా ఉంటా. ఆ క్షణం ఆమె చాలా కామ్‌గా ఉంటుంది. కోపంతో ఏమైనా అన్నా తనే సారీ చెబుతుంది. హీరోగా బిజీ అయిన తర్వాత ఇంటి బాధ్యత మొత్తం జీవిత తీసుకుంది. నన్ను ఓ పిల్లాడిలా చూసుకుంది. నా అవసరాలన్నీ తీరుస్తుంది. ఇలాటి ఇల్లాలు ఉంటే ఇక కావాల్సిందేముంది? అందుకే నా బలం అంతా జీవితనే..అంటున్నారు రాజశేఖర్.

  భార్యగా బాధ్యతలు చూసుకోవడంలో తప్పేముంది? భర్త, పిల్లల మంచి చెడ్డలు చూసుకోవడం సంతోషకరమే కదా. ఒత్తిడితో ఇంటికి వచ్చే భర్తకు భార్య వల్ల ఉపశమనం కలగాలి. ప్రేమ ఉంటే ఇగో ఉండకూడదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఇద్దరూ ఒకటే అయితే ఎవరు సారీ చెబితే ఏముంది? ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్లలేక. మా కోసం ఈయన చాలా అవకాశాలు వదిలేసుకున్నారు. నా కోసం, పిల్లల కోసం అంత చేసినపుడు నేను కొంతైనా చేయాలి కదా.. ప్రేమ ఉన్న చోట కోపం కూడా ఉంటుంది. దాన్ని అర్ధం చేసుకుంటే సమస్య ఉండదు అంటున్నారు జీవిత.

  English summary
  More than just a couple, they are actors, filmmakers, politicians and keen businessmen. Infact, it would be safe to call Jeevitha and Rajasekhar, Tollywood's power couple. Whether it is at filmi events or media interactions, the two are always together.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X