For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ తో అలాంటి డైలాగు చెప్పిస్తారా? జీవిత, సెక్స్ అవసరమే కానీ

  By Srikanya
  |

  హైదరాబాద్ : యంగ్‌టైగర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ సినిమాలో ఒక డైలాగు గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ డైలాగు గురించి చర్చ వచ్చింది. ఇంతకీ ఆ డైలాగు ఏంటీ అంటారా...మీకు ఇంకా గుర్తు రాలేదా..

  కాజల్: మీ పోలీస్ కుక్కలు చాలా ఫాస్ట్‌గా ఉంటాయటగా..మా కుక్కలు క్రాసింగ్‌కు వచ్చాయి. కాస్త మీ కుక్కలను పంపుతారా.

  ఎన్టీఆర్: ఇక్కడ మాకే క్రాసింగ్ కాలేదనుకుంటే కుక్కలకు క్రాసింగ్ కావాలా (సినిమాలో లేదు. సెన్సార్ కట్). ఈ డైలాగు గురించి జీవిత రీసెంట్ గా ఓ ఇంటర్వూలో మాట్లాడారు.

  జీవిత మాట్లాడుతూ...'పాత సినిమాల్లో ఐ లవ్‌ యూ అని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి చెప్పించేవారు. ఇప్పుడు ఇదొక కామన్‌ వర్డ్‌గా మారిపోయింది. 'కుక్కలు క్రాసింగ్‌కి వచ్చాయి అని హీరోయిన్‌ అంటే, 'కుక్కలేనా, మేం కూడా క్రాసింగ్‌కి వచ్చాం' అనే అర్థంలో అంటాడు హీరో. ఒక గొప్ప హీరోతో అలా చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు ఆమె. అలాగే ఆమె అనేక విషయాలపై మాట్లాడారు.

  సెక్స్ నింపి..

  సెక్స్ నింపి..

  టాప్‌ హీరోలు, హీరోయిన్లతో సినిమాలు తీస్తున్నారు. కానీ క్రైమ్‌, సెక్స్‌ నింపి ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంటారు. హీరో చెయ్యడం వల్ల యువతరం దాన్నే హాబీగా తీసుకుని తప్పుదారిపడుతోంది. అందుకే కనీస సామాజిక బాధ్యతను బుర్రలో పెట్టుకుని ఎంతో కొంత సొసైటీకి మేలు చేసే సినిమాలు నిర్మించాలి. అప్పుడు కొంతైనా సినిమాల వల్ల మంచి జరుగుతుంది అని అన్నారు జీవిత.

  క్యారక్టర్ కాపాడుకోవాలి

  క్యారక్టర్ కాపాడుకోవాలి

  జీవితంలో సెక్స్‌ ఎంతో అవసరం. బ్రష్‌ చేసుకున్నట్టు, స్నానం చేసినట్టు, కాఫీ తాగినట్టు దాంపత్యసుఖం కూడా జీవితంలో భాగమే. దాంతోపాటే సహజీవనం కూడా వచ్చింది. ఏది వచ్చినా స్ర్తీ తన క్యారెక్టర్‌ కాపాడుకోవాలి.

  ఆ ధోరణి కరెక్ట్ కాదు

  ఆ ధోరణి కరెక్ట్ కాదు

  భార్య అయినా, ప్రాస్టిట్యూట్‌ అయినా...స్ర్తీ ఇష్టం లేకుండా పురుషుడు ఆమెతో గడపలేడు. భర్త దుర్మార్గుడు, దుష్టుడైతే వాడితోనే జీవితం గడపాల్సిన అవసరం లేదు. ‘పెళ్ళి చేసుకున్నా, నా చెప్పుచేతల్లో ఉండాలి' అనే ధోరణి కరెక్టుకాదు. అందుకే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేం అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి.

  సమాజంలో పెరిగాయి

  సమాజంలో పెరిగాయి

  పిల్లల్ని కన్న తర్వాత మాత్రం కాంప్రమైజ్‌ కావడం చాలా ఇంపార్టెంట్‌. జీవిత విలువల్ని అర్థం చేసుకుని ఎవరో ఒకరు ఎడ్జస్ట్‌ కావడం మంచిది. ఇలాంటి ధోరణులు సమాజంలో పెరిగాయి గనుక ఈ రోజుల్లో కుటుంబాలకు, యువతకు, విద్యార్థులకు మంచిని ప్రబోధించే చిత్రాలు ఎక్కువ రావాలి.

  ఆడది నో అంటే...

  ఆడది నో అంటే...

  అమితాబ్‌బచ్చన్‌ చిత్రం ‘పింక్‌' ఎంతో బాగుంది. ఆడపిల్లల గురించి ఈ చిత్రంలో ఎన్నో విషయాలు చెప్పారు. భర్త కావచ్చు, ప్రాస్టిట్యూట్‌ దగ్గర విటుడు కావచ్చు, ఆడది నో అంటే నో అంతే. సుప్రీంకోర్టు నుంచి ఎన్నో చట్టాలు తెచ్చినా ఇంకా మార్పు రావడం లేదు. ఇలాంటి ప్రబోధాత్మక చిత్రాలు రావాలి అని చెప్పుకొచ్చారామె.

  పోలీసులుకు భయపడేవారు

  పోలీసులుకు భయపడేవారు

  ఒకప్పుడు సెక్స్‌ సీడీలను రహస్యంగా చూసేవారు. పోలీసులకు భయపడేవారు. కానీ ఇప్పుడో? అదో ఫ్యాషన్‌గా మారింది. అదెంతో ఈజీ అయిపోయింది. తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చిన స్వేచ్ఛను వారు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

  ఫేస్ బుక్ లు, వాట్సప్ లు

  ఫేస్ బుక్ లు, వాట్సప్ లు

  పెళ్ళి విషయానికి వస్తే ఒక రోజు పెళ్ళి, రెండో రోజు డైవోర్స్‌ అన్నట్టుగా ఉంది. విడాకులు పెరిగాయి. కలిసి బతకలేకపోతున్నారు. నేటి యువతరంలో మంచిదారిలో వెళ్ళేవారిశాతం తక్కువ. చెడ్డదారిలో వెళ్ళే అవకాశాలే ఎక్కువ. ప్రభుత్వం తల్చుకుంటే దీన్ని ఆపగలదు కదా! ముఖ్యంగా ఫేస్‌బుక్కులు, వాట్స్ ‌ప్ లు ఈ జనరేషన్‌ని నాశనం చేస్తున్నాయి. ఈ విషయంలో ముందు పెద్దలు మారాలి.

  అన్నీ హీరోయిన్ చేతే..

  అన్నీ హీరోయిన్ చేతే..

  ఒకప్పుడు సినిమాల్లో వ్యాంప్‌, హీరోయిన్‌ ఉండేవారు. ఈ పాత్రల మధ్య తేడా చూపించేవారు. అచ్చమైన తెలుగు ఆడపడుచులా కనిపించే హీరోయిన్‌వైపు అందరూ ఆకర్షితులయ్యేవారు. ఇప్పుడది లేదు. అన్నీ హీరోయిన్‌చేతే చేయిస్తున్నారు. దానికితోడు హీరోయిన్లు కూడా వ్యాంప్‌ ఎందుకు, మేమే చేస్తాం అన్నట్టు ఉంటున్నారు అంటూ వివరించారు జీవిత.

  ఆ ప్రొడక్ట్ నిజంగా...

  ఆ ప్రొడక్ట్ నిజంగా...

  టాప్‌ హీరోలతో తమ ప్రొడక్ట్ లకు ప్రచారం చేయిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు బాగుంది. కానీ ఇది అంత కరెక్టు కాదు. ఆ ప్రొడక్ట్ సొసైటీకి ఉపయోగకరమా కాదా? అన్నదే మీమాంస. ఒక ప్రొడక్ట్‌ నిజంగా ప్రజలకు ఉపయోగకరమా కాదా? అనేది ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది.

  చదవునూ ..ప్రేమనీ

  చదవునూ ..ప్రేమనీ

  వయసులో ఉన్న వారికి అమ్మానాన్న చెప్పేది పనికిరాదు. ప్రతీదీ తమకే తెలుసునన్న ఫీలింగ్‌తో దబాయించేస్తారు. చదువుకోవాల్సిన సమయంలో లవ్‌ మంచిది కాదు. కానీ ఈ లవ్‌ అనేది నాకూ వచ్చింది. అందరికీ వస్తుంది. కానీ చదువునీ, దీన్నీ కలపకూడదు. మీరు సిన్సియర్‌గా ఉంటే స్నేహం కంటిన్యూ చెయ్యండి. అప్పుడు నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఈ లవ్‌ అనేది నిజమైనదా? మంచి ఫ్రెండ్‌షిప్పా? అనే దానికి మీకే ఆ తర్వాత మీనింగ్‌ అర్థం అవుతుంది.

  ప్రేమ గట్టిదైతేనే

  ప్రేమ గట్టిదైతేనే

  మొదటిరోజు లవ్‌, రెండోరోజు ముద్దు, మూడోరోజు కౌగిలింత, మర్రోజు కొట్టుకునే స్థితికి రావద్దు. ఆరోగ్యకరమైన స్నేహంతో ఉండండి. చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రేమ గట్టిదైతే అప్పుడు పెళ్ళి చేసుకోండి. రియల్‌ లవ్‌ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.

  అలాంటి విషయాలతో సినిమాలు

  అలాంటి విషయాలతో సినిమాలు

  తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాధించకూడదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటివాటిని పరిధిలో ఉపయోగిస్తూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి విషయాలను బోధించే మంచి చిత్రాలు నిర్మించాలి. అప్పుడు తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. తల్లిదండ్రులు కూడా చాకచక్యంగా వ్యవహరించాలి.

  చాలా తక్కువే..

  చాలా తక్కువే..

  మూడేళ్ళుగా అన్ని రకాల చిత్రాలూ వస్తున్నట్టు అనిపిస్తోంది. మంచి కథ ఎన్నుకుంటున్నారు. ట్రెండ్‌ మారింది. కమర్షియల్‌ వ్యూ తగ్గించారు. సొసైటీకి ఉపయోగపడే చిత్రాలు వస్తున్నా చాలా తక్కువే. సినిమా ఒక స్ర్టాంగ్‌ మీడియా. అంత వేగంగా మరేదీ ప్రజల్లోకి వెళ్లలేదు.

  హీరో చెప్పిందే వేదం

  హీరో చెప్పిందే వేదం

  దేవుడే దిగివచ్చి చెప్పినా వినని యువతరం, సినిమాల్లో హీరో చెప్పిందే వేదంగా భావించి ఫాలో అవుతున్నారు. సినిమాకి ఇంత క్రేజ్‌ ఉన్నప్పుడు ఆ సినిమా ద్వారానే యువతకు ప్రబోధం చేయాలి. విలువల్ని కాపాడేందుకు హీరోతో సందేశం చెప్పించవచ్చు. సినిమాను మరీ దిగజార్చి తీయాల్సిన పనిలేదు. ఈ ధోరణి మారాలి.

  ఆత్మ విమర్శ చేసుకోవాలి

  ఆత్మ విమర్శ చేసుకోవాలి

  ఒకప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడెలా ఉన్నాం? పిల్లలు ఏ దార్లో వెళుతున్నారో తెలియని అగమ్యగోచరంలో ఉన్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రతి బజారులో పబ్‌ వెలుస్తోంది. బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోంది. దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమా? రాజకీయ నాయకులా? నేను మాత్రం అందరినీ తప్పుపడుతున్నాను. కనుక ఎవరికివారే ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు జీవిత.

  English summary
  Jeevitha Rajashekar now comments on Ntr's Temper movie Dialouge.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X