»   » నాని ‘జెండాపై కపిరాజు’ రిలీజ్ డేట్

నాని ‘జెండాపై కపిరాజు’ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాని , అమలా పాల్ , రాగిణి ద్వివేది హీరో హీరోయిన్స్ గా శంబో శివశంబో వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన సముద్రఖని దర్శకత్వం లో, రామ్మోహన్ రావు సమర్పణలో, మల్టీ డైమన్షన్ ప్రై లి. పతాకం పై రజత్ పార్థసారధి , ఎస్ శ్రీనివాసన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జెండా పై కపిరాజు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ సందర్బంగా చిత్ర వివరాలను గురించి నిర్మాతలు తెలియచేస్తూ ... ప్రతి వ్యక్తి తనను తానూ సంస్కరిచుకుంటే చాలు దేశాన్ని సంస్కరించి నట్లే అనే పాయింట్ తో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ప్రమోషన్ కుడా ప్రారంబించాము. ఈ నెల 21న భారిగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం, నాని కెరీర్ లో ఇదే వవిద్యమైనవైవిధ్యమైన సినిమాగా నిలబడుతుంది. నాని ఈ సినిమాకోసం చాల హార్డ్ వర్క్ చేసాడు. ముఖ్యంగా నాని ఈ సినిమాలో ద్విపత్రాబినయం చేస్తున్నా మొదటి సినిమా ఇది. నిజజీవితలను దగ్గరగా చూపించే సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వల్సింది కాని కొన్ని టెక్నికల్ సమస్యల వాళ్ళ ఆలస్యం అయ్యింది. తప్పకుడా ఈ సినిమా మంచి విజయం సదిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.


Jenda Pai Kapiraju finally releasing for Ugadi

నాని , అమలా పాల్ , రాగిణి ద్వివేది , శరత్ కుమార్ , శివ బాలాజీ , వెన్నెల కిషోర్ , ఆహుతి ప్రసాద్ , తనికెళ్ళ భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : శశాంక్ వెన్నెలకంటి , మ్యూజిక్ - జి వి ప్రకాష్ కుమార్ , ఎడిటింగ్ - ఫాజిల్ , నిర్మాతలు - రజత్ పార్ధ సారది, కె ఎస్ శ్రీనివాసన్ కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం - సముద్ర ఖని .

English summary
The makers of Nani's Jenda Pai Kapiraju have cleared all the hurdles before their release and announced their release plans. The movie release which was postponing since February last year will now release on March 21st as Ugadi Special. The Tamil version of the movie was already released but failed to fare well. The movie is based on a real life incident that has inspired Samudrakhani, the film's director.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu