For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అజ్ఞాతవాసి'కి హెచ్చరిక: ఇక చర్యలే అన్న జెరోం సల్లే.., ఇంతచేసి స్పందించరా?

  |

  ఇటీవలి కాలంలో 'అజ్ఞాతవాసి' సినిమాకు వచ్చినంత దారుణమైన టాక్ మరే సినిమాకు రాలేదు. ఓవర్ సీస్‌లో ప్రీమియర్స్ పడ్డాయో.. లేదో.. సినిమా పోయినట్లే అన్న టాక్ బయటకొచ్చేసింది. ఓవైపు సినిమా ఫలితంతోనే తలపట్టుకున్న నిర్మాతలకు మరోవైపు ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోం సల్లే నుంచి కూడా తలనొప్పులు మొదలవడం వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. తాజాగా జెరోం సల్లే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

  వారమైంది.., ఇక చర్యలే: జెరోం సల్లే

  'కాపీ అవసరం లేకుండా క్రియేటివిటీతో సినిమాలు తీయగల సత్తా భారతీయ చిత్ర పరిశ్రమకు ఉందనే భావిస్తున్నాను. అయితే, గత వారం రోజులుగా 'అజ్ఞాతవాసి' టీమ్ నుంచి మౌనమే సమాధానమైంది. ఇక చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నా..' అంటూ జెరోం సల్లే తాజాగా ట్వీట్ చేశారు.

   హెచ్చరిక లాంటిదేనా?:

  హెచ్చరిక లాంటిదేనా?:

  జెరోం సల్లే చేసిన ట్వీట్ 'అజ్ఞాతవాసి' చిత్ర యూనిట్‌కు పరోక్షంగా ఒక హెచ్చరిక లాంటిదేనని చెప్పవచ్చు. టికెట్ కొనుక్కుని మరీ విడుదల రోజే సినిమా చూసిన జెరోం సల్లే.. 'అజ్ఞాతవాసి'ని 'లార్గో వించ్' కాపీ అని తేల్చేసిన సంగతి తెలిసిందే.

  ‘అజ్ఞాతవాసి’ చూసిన ఫ్రెంచి డైరెక్టర్.. ట్విట్టర్లో షాకింగ్ కామెంట్స్ !
   అలా జరిగిందా?:

  అలా జరిగిందా?:

  జెరోం సల్లే దర్శకత్వం వహించిన 'లార్గో వించ్' హక్కులు ఇండియాలో టీ-సిరీస్ చేతిలో ఉన్నాయి. దీంతో ఈ వివాదాన్ని సద్దుమణిగించడానికి సీక్రెట్‌గా ఆ సంస్థకు డబ్బులు ముట్టజెప్పారని, అందుకే టీసిరిస్ నుంచి ఎలాంటి స్పందన లేదనే ప్రచారం జరిగింది.

  గతంలోనే చెప్పిన జెరోం..:

  గతంలోనే చెప్పిన జెరోం..:

  'అజ్ఞాతవాసి' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడంతో.. ఒక్క సంస్థతో ఒప్పందం చేసుకున్నంత మాత్రాన కాపీ రైట్ సమస్యలను అడ్డుకోలేమని జెరోం సల్లే భావించాడు. ఇదే విషయాన్ని గతంలో ట్విట్టర్ లోనూ పోస్ట్ చేశాడు.

  టీ-సిరిస్ కు అమ్మిన హక్కులు ఇండియాకు పరిమితం.. కానీ 'అజ్ఞాతవాసి' ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కదా?.. కాబట్టి ఒక్క సంస్థతో ఒప్పందం ద్వారా కాపీ రైట్ సమస్యను అధిగమించలేం అని జెరోం అప్పట్లో ట్వీట్ చేశాడు.

   నిర్మాతలకు కష్టమే:

  నిర్మాతలకు కష్టమే:

  టాలీవుడ్ చరిత్రలోనే భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయిన 'అజ్ఞాతవాసి' బయ్యర్లను, డిస్ట్రిబ్యూటర్లను బెంబేలెత్తిస్తోంది. ఇక నిర్మాతల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇలాంటి తరుణంలో జెరోం సల్లే లీగల్ చర్యలకు దిగుతాననడంతో 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.

   త్రివిక్రమే బాధ్యుడా?:

  త్రివిక్రమే బాధ్యుడా?:

  సినిమాపై కాపీ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అందరి వేళ్లు త్రివిక్రమ్ వైపే చూపిస్తున్నాయి. కేవలం త్రివిక్రమ్ వల్లే పవన్ కల్యాణ్ కు ఇంత డిజాస్టర్ వచ్చిందని అటు అభిమానులు కూడా వాపోతున్న పరిస్థితి. ఇకపోతే ఇప్పుడు జెరోం సల్లే న్యాయ పోరాటానికి దిగితే త్రివిక్రమ్ కు కూడా కష్టాలు తప్పవనే చెప్పాలి. మరి జెరోం సల్లే ఆరోపణలకు త్రివిక్రమే బాధ్యత తీసుకుంటాడా? అన్నది చెప్పలేం. ఎటొచ్చి నిర్మాతలకు మాత్రం ఇదో పెద్ద గండమే.

   ఇప్పటికైనా స్పందిస్తారా?:

  ఇప్పటికైనా స్పందిస్తారా?:

  జెరోం తాజా ట్వీట్ చేస్తుంటే 'అజ్ఞాతవాసి' టీమ్ నుంచి ఏమైనా స్పందన వస్తుందేమోనన్న ఉద్దేశంతోనే ఆయన ఇన్నాళ్లు ఎదురుచూసినట్లుగా అర్థమవుతోంది. అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే ఇక లీగల్ చర్యలే కరెక్ట్ అని ఆయన భావించి ఉండవచ్చు. మరి ఇప్పటికైనా 'అజ్ఞాతవాసి' టీమ్ దీనిపై నోరు విప్పుతారేమో చూడాలి!

  English summary
  French Director Jerom Salle ready to take action on Agnyaathavasi movie. He said Indian cinema has all the necessary talent and creativity for not having to plagiarize. And the silence from #Agnathavaasi team since one week is deafening. So let’s take action now.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more