»   » మీడియా ఓవరాక్షన్.... శ్రీదేవి కూతురు హర్టయింది, ఏం జరిగిదంటే?

మీడియా ఓవరాక్షన్.... శ్రీదేవి కూతురు హర్టయింది, ఏం జరిగిదంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: స్టార్స్ మాత్రమే కాదు... స్టార్స్ కిడ్స్ కూడా మీడియా కెమెరాలు చూస్తే కంగారుపడే పరిస్థితి. వారు ఎప్పుడు ఎక్కడ కనిపిస్తారా? ఎప్పుడు తమ కెమెరాలకు చిక్కుతారా? అని మీడియా కెమెరాలు కాచుకుని కూర్చుకుంటున్నరోజులు ఇవి!

ఫోటోలే కదా... తీసుకుంటే పోయేదేముందిలే? అనుకుంటే పొరపాటే. స్టార్స్‌తో పాటు ఎవరైనా వ్యక్తులు ఉంటే చాలా.... వారికి లింకులు పెట్టేసి వార్తలు రాయడం, వారి మధ్య ఏదో 'సం'బంధం ఉందని ప్రచారం చేయడం.... వాటి వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలతో సదరు సెలబ్రిటీలు ఇబ్బందుల్లో పడటం లాంటివి ఇపుడు సర్వసాధారణంగా జరుగుతున్న తంతు.

తాజాగా ఇలాంటి పరిస్థితే శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్‌కు ఎదురైంది.

మీడియాకు చిక్కిన ఝాన్వి-ఇషాన్

మీడియాకు చిక్కిన ఝాన్వి-ఇషాన్

శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ ఇటీవల ముంబైలో ఓ మాల్‌లో సినిమా చూడటానికి వచ్చి మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ ప్రచారం మొదలైంది.

హర్టయిన ఝాన్వి

హర్టయిన ఝాన్వి

తమ గురించి ఇలా మీడియాలో వార్తలు రావడంతో ఝాన్వి కపూర్ హర్టయింది. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని... ఇలాంటివి లేనిపోనివి రాయడం ఏమిటని ఝాన్వి కపూర్ హర్టయిందట.

ఇద్దరూ కలిసి మూవీ డేట్‌కు ఎందుకొచ్చినట్లు?

ఇద్దరూ కలిసి మూవీ డేట్‌కు ఎందుకొచ్చినట్లు?

మరాఠీలో సూపర్ హిట్టయిన ‘సైరాట్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో ఝాన్వి, ఇషాన్ కలిసి నటించబోతున్నారు. సినిమా మొదలయ్యే ముందు ఇద్దరి మధ్య కాస్త పరిచయం, స్నేహం పెరిగితే రేపు సినిమా మొదలైన తర్వాత సెట్స్ మీద కంఫర్టబుల్ గా ఉంటారనే ఉద్దేశ్యంతో అప్పుడప్పుడు ఇలా ఇద్దరూ కలిసి డేట్‌కు వస్తున్నారట.

ఝాన్వి సర్కిల్ వేరు, స్నేహితులు వేరు...

ఝాన్వి సర్కిల్ వేరు, స్నేహితులు వేరు...

వాస్తవానికి ఝాన్వి కపూర్ సర్కిల్ వేరు, ఆమె స్నేహితుల ప్రపంచం వేరు. కేవలం ఇషాన్‌తో పరిచయం పెంచుకోవడానికి, ఫ్రీగా మూవ్ అవ్వడానికే ఇలా అప్పుడప్పుడు డేట్ కు వస్తున్నారు.

ఝాన్వి బాయ్ ఫ్రెండ్

ఝాన్వి బాయ్ ఫ్రెండ్

ఝాన్వి కపూర్ గురించి కొంతకాలం క్రితమే మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. గతంలో ఆమె అక్షత్ రంఝన్ అనే యువకుడితో ప్రేమలో పడిందని టాక్. తర్వాత మరో వ్యక్తితోనూ ఆమె క్లోజ్ గా ఉండే ఫోటోలు లీక్ అయ్యాయి. యవ్వనంలో ఉన్నపుడు ఇలాంటి చాలా కామన్.

అన్నీ వదిలేసిన ఝాన్వి

అన్నీ వదిలేసిన ఝాన్వి

ప్రస్తుతం ఝాన్వి కపూర్ అన్నీ వదిలేసి బుద్దిగా సినిమా కెరీర్ మీద ఫోకస్ పెట్టిందట. త్వరలో హీరోయిన్‌గా పరిచయం అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటోంది. పెద్ద స్టార్ అయి అమ్మానాన్నల పేరు నిలబెట్టాలని ఆశ పడుతోంది.

English summary
Being a star-kid isn't always the bed of roses! It has its own pros and cons. They are constantly under the media scan and sometimes it's irritating. Something similar happened with Sridevi's elder daughter Jhanvi Kapoor. We hear that the leggy lass is bit upset with the paparazzi and her reasons are totally justified.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu