»   » ఆత్మహత్య కాదు హత్యే: జియా మదర్ స్ట్రింగ్ ఆపరేషన్

ఆత్మహత్య కాదు హత్యే: జియా మదర్ స్ట్రింగ్ ఆపరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన కూతురు జియా ఖాన్ మృతి కేసులో నిజా నిజాలు బయటకు తీసే వరకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు రబియా అమిన్ ఖాన్. జియా ఖాన్ ఆత్యహత్య చేసుకోలేదని, ఆమె హత్య చేయబడిందని ముందు నుండీ వాదిస్తూ వస్తున్న రబియా ఖాన్ తాజాగా స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జియా ఖాన్‌ది ఆత్మహత్యే అంటూ పోలీసులు చేసిన వాదనకు మద్దతుగా నిలిచిన 8 మందిపై రబియా ఖాన్ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు.

స్ట్రింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ముంబై హైకోర్టుకు సమర్పించిన రబియా ఖాన్ ఈ కేసును మళ్లీ ఫ్రెష్‌గా ఇన్వెస్ట్ చేయాలని ఆదేశించారు. 8 మంది సాక్షులు ఈ కేసులో మాట మార్చారని ఆమె వాదిస్తున్నారు. రబియా లాయర్ దినేష్ తివారీ మాట్లాడుతూ...జియా ఖాన్ హత్య చేయబడింది అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

Jiah Khan

తన కూతురు జియాన్‌ఖాన్‌ను హత్య చేసి ఆ తర్వాత తనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హంతకులు ఏర్పాట్లు చేశారని రబియాఖాన్ ఆరోపించారు. ఫోరెన్సిక్ నిపుణులు జియాఖాన్‌ది ఆత్మహత్య కాదని, బలవంతంగా హత్య చేసినట్లు ఉందని తమ నివేదికలో తెలిపినట్లు పేర్కొంది.

జియాఖాన్‌ను హత్య చేసిన తర్వాతనే ఉరివేశారని రబియాఖాన్ ఆరోపించారు. ఈ ఆరోపణకు తగిన కారణాలున్నాయని ఆమె తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కళ్లు తేలిసినట్లు, నాలుక బయటికి వచ్చి ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో జియా ఆ స్థితిలో లేదని తెలిపారు. ఘటనా స్థలంలో మృతురాలికి ఉరివేసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. జియాఖాన్ ముఖం, శరీరంపై గాయాలున్నాయని పేర్కొన్నారు.

ఓ పలుచని గుడ్డతో తనకు తాను ఉరివేసుకుందని పోలీసులు తమ విచారణలో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక మాత్రం ఇందుకు విరుద్ధంగా పలుచని గుడ్డను ఉపయోగించలేదని తెలిపింది. జియా తనకు తాను ఉరివేసుకున్నట్లుగా ఆనవాళ్లు లేవని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. సిసిటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినట్లయితే ట్రాక్ సూట్ ధరించిన జియా తన ఇంటిలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. జియా చనిపోయిన తర్వాత నైట్ గౌన్‌లో ఉంది, అయితే ఉరివేసుకోవాలనుకుంటే డ్రెస్ ఎందుకు మార్చుకుంటుందని ఆమె ప్రశ్నిస్తున్నారు.

English summary
Jiah Khan's mother Rabiya Amin Khan is adamant about unveiling the truth about her daughter's death. Rabiya conducted a sting operation on eight prime witnesses who supported the police's claim that Jiah had committed suicide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu