»   » జియా సూసైడ్ కేసు : సూరజ్‌కు బెయిల్ మంజూరు

జియా సూసైడ్ కేసు : సూరజ్‌కు బెయిల్ మంజూరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ఆమె ప్రియుడు సూరజ్ పంచోలికి ముంబై హైకోర్టు సోమవారం రూ. 50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు ముంబై సెషన్స్ కోర్టు సూరజ్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించగా....అతను హైకోర్టును ఆశ్రయించాడు.

నటి జియా ఖాన్ ఆత్మహత్య సంఘటనకు సంబంధించి కేసులో సూరజ్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 22 సంవత్సరాల వయస్సు గల సూరజ్ బాలీవుడ్ నటులైన ఆదిత్య పంచోలి, జరీనా వాహెబ్‌ల సుపుత్రుడు. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు అతనికి జుడీషియల్ కస్టడీని జులై 11 వరకు పొడగించగా...దాన్ని సవాల్ చేస్తూ సూరజ్ హైకోర్టుకెక్కాడు.

జియా ఖాన్ రాసిన ఆరు పేజల సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు సూరజ్ పంచోలిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో సూరజ్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని జియా ఖాన్ పేర్కొంది. అంతే కాకుండా సూరజ్ వల్ల తాను గర్భం దాల్చానని, అబార్షన్ కూడా అయిందని పేర్కొంది. సూరజ్ కారణంగానే జియా ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ లేఖ స్పష్టం చేసింది.

అయితే సూరజ్ తరుపు లాయర్ కోర్టులో....జియా రాసిన లేఖ ఎప్పుటిదో తెలియజేసే తేదీ ఏమీ లేదని, అదే విధంగా జియా సూసైడ్ చేసుకోవడానికి అతనే కారణమే బలమైన సాక్ష్యాలు లేవని వాదించారు. దీంతో పాటు జియా రాసిన లేఖలోని రైటింగుకు, సంతానికి చాలా తేడా ఉందని వాదించారు.

జియా ఖాన్ జూన్ 3వ తేదీన ముంబై జుహు లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఆమె తల్లి సోదరి లేరు. పోస్టు మార్టమ్ రిపోర్టు ప్రకారం జియా ఖాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమయింది.

English summary
Suraj Pancholi has been granted bail on the surety of Rs 50,000 by the Bombay High Court on Monday, July 1. The aspiring actor earlier was denied bail by a session court in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu