»   »  జియాఖాన్ కేసు : ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు

జియాఖాన్ కేసు : ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jiah Khan
ముంబయి : నటి జియాతో తాను స్నేహపూర్వకంగా మాత్రమే ఉండేవాడినని, ఆమె తల్లికి లభించిందంటున్న లేఖలో తన పేరు లేకున్నా ఉద్దేశపూర్వకంగానే ఇరికించినట్లు సూరజ్‌ పంచోలి వాదిస్తున్నాడు. కిందికోర్టు అతనికి బెయిలు నిరాకరించడంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. విచారణకు స్వీకరించిన హైకోర్టు జులై 5న తీర్పు ఇవ్వనుంది.

సూరజ్‌ ప్రస్తుతం అర్థర్‌రోడ్డు జైలులో ఉన్నాడు. గర్భస్రావంతో అవస్థలు పడుతోండగా ప్రియుడు సూరజ్‌ పంచోలి ఆమెను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేయడంతోనే జియా ఆత్మహత్యకు పాల్పడిందంటూ సెషన్స్‌ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం విదితమే.

ఆత్మహత్య అనంతరం జియాఖాన్‌ పడకగదిలో ఆమె తల్లికి లభించిన ఆరుపేజీల లేఖ ఆధారంగానే ఈనెల 10న సూరజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అతడిని అంధేరీ న్యాయస్థానంలో హాజరపరచగా రిమాండ్‌ పొడిగించారు.

బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన సూరజ్‌ పంచోలికి న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. ఈనెల 3న నటి జియాఖాన్‌ జుహూలోని సాగర్‌ సంగీత భవనంలో నివసిస్తున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.

జియాఖాన్‌ ఆత్మహత్యకు ముందే రాసిన ఆరు పేజీల లేఖలో సూరజ్‌ పంచోలితో ఉన్న ప్రేమ సంబంధం గురించి పూర్తిగా వివరాలు వెల్లడించింది. లేఖను జియా తల్లి పోలీసులకు అందజేయడంతో దీని ఆధారంగా ఈ నెల 11న అరెస్టయిన సూరజ్‌ మరికొద్ది రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది. జియా ఉరి వేసుకోవడం వల్లనే మృతి చెందినట్లు శవపరీక్ష నివేదికలో తేలింది.

English summary
A sessions court rejected the bail plea filed by Suraj Pancholi, arrested on charges of abetting the suicide of Bollywood actress Nafisa alias Jiah Khan. The prosecution opposed his bail application on grounds that the investigations had already reached a crucial stage and his release at this stage could hamper the probe.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu