»   » విజయ్-కాజల్ ‘జిల్లా’ తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్

విజయ్-కాజల్ ‘జిల్లా’ తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘జిల్లా' తమిళనాడులో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్కడ రూ. 120 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించింది. విజయ్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.

ఆర్‌.బి.చౌదరి సమర్పణలో ప్రసాద్‌ సన్నిధితో కలిసి యువ నిర్మాత తమటం కుమార్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగులోనూ ఈచిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నిధి మాట్లాడుతూ.. ''ఆర్‌.బి.చౌదరి వంటి లెజండరీ ప్రొడ్యూసర్‌ సమర్పణలో 'జిల్లా' చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ కోసం ఎందరో టాప్‌ ప్రొడ్యూసర్స్‌ పోటీ పడినప్పటికీ.. మాలాంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం, మరియు మా మీద గల నమ్మకంతో 'జిల్లా' తెలుగు హక్కులు మాకు ఇవ్వడమే కాకుండా.. ఈ చిత్రాన్ని తెలుగులో మాతో కలిసి సమర్పించేందుకు పెద్ద మనసుతో అంగీకరించిన ఆర్‌.బి.చౌదరిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. డా॥బ్రహ్మానందం, ఎల్‌.బి.శ్రీరాం, సురేఖావాణి తదితరులపై తెలుగు వెర్షన్‌ కోసం కొన్ని సన్నివేశాల్ని ప్రత్యేకంగా చిత్రీకరించారు.


'Jilla' telugu first look poster

ఈ చిత్ర హీరోలు విజయ్‌, మోహన్‌లాల్‌, ముఖ్యపాత్రధారులు ప్రదీప్‌రావత్‌, సంపత్‌రాజ్‌ తదితరులు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు కావడం తెలిసిందే. ఇక హీరోయిన్‌ కాజల్‌కు తెలుగులో గల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌.బి.చౌదరిగారి తనయుడు, తమిళ రైజింగ్‌స్టార్‌ జీవా ఈ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్ర పోషించడం విశేషం. త్వరలో ఈ చిత్రం తెలుగు టైటిల్‌ను అనౌన్స్‌ చేయనున్నాం' అన్నారు.


'Jilla' telugu first look poster

మహత్‌ రాఘవేంద్ర, నివేదా థామస్‌, సూరి, పూర్ణిమా భాగ్యరాజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: గణేష్‌ రాజవేలు, ఎడిటింగ్‌: డాన్‌ మ్యాక్స్‌, మ్యూజిక్‌: డి.ఇమాన్‌, పాటలు: వెన్నెలకంటి, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, నిర్మాతలు: తమటం కుమార్‌రెడ్డి`ప్రసాద్‌ సన్నిధి, సహనిర్మాత: నామన శంకర్‌రావు, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, నిర్మాణ సంస్థలు: సూపర్‌గుడ్‌ ఫిలింస్‌`శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఆర్‌.టి.నేసన్‌.

English summary
Vijay, Kajal starrer 'Jilla' telugu first look poster released.
Please Wait while comments are loading...