For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వరుణ్ తేజ్ లోఫర్: జియా జిలే సాంగ్ ప్రోమో (వీడియో)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లోఫర్'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక సోమవారం సాయంత్రం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా సాగింది. ఆడియోకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ టీజర్లు కూడా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. తాజాగా ‘జియా జిలే' అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

  ఇది వరుణ్‌ తేజ్‌కు మూడో చిత్రం. సీకే ఎంటర్‌టైమెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 17 డిసెంబర్ న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

  Jiya Jile Song Promo - Loafer

  ఈ చిత్రంలో రేవతి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా ఇటీవల విడుదలైన 'కంచె' చిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్టయింది. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' తర్వాత ఆ తరహాలో చేస్తున్న మరో సినిమా ఇది. అమ్మ సెంటిమెంట్‌ ఆధారంగా తెరకెక్కించా. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ సెంటిమెంట్‌ సినిమా చేయడం నాకే కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ట్విట్టర్‌లోనూ, అక్కడా ఇక్కడా చాలా మంది నన్ను పదే పదే అడిగేవాళ్లు... 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' లాంటి సినిమా చేయరా? అని. ఈ సినిమాతో మళ్లీ అలాంటి ఓ మంచి కథ కుదిరింది. రచయితగా నాకు సంతృప్తినిచ్చిన కథ ఇది.

  వరుణ్‌తేజ్‌ చాలా బాగా నటించాడు. తప్పకుండా మంచి కథానాయకుడు అవుతాడు. నాగబాబుగారు గర్వపడేలా చేస్తాడు. నిజాయతీగా నటిస్తాడు. ఎంత పొడుగున్నా వరుణ్‌లో ఓ రకమైన అమాయకత్వం కనిపిస్తుంటుంది. అది అతడి కెరీర్‌కి బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నా. ఈ సినిమాతో దిశా పటాని అనే కథానాయికని పరిచయం చేస్తున్నాం. ఒకసారి చూడగానే అందరికీ నచ్చుతుంది. కథలో భాగంగానే ఆ పేరు పెట్టాం. ఇందులో కథానాయకుడికి పనీ పాట ఏమీ ఉండదు. కానీ చివరికి మంచివాడిలా మారతాడు. ఈ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూశాక బాగా అర్థమవుతుంది. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసినప్పట్నుంచి పేరు మార్చమని రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత సి.కల్యాణ్‌ నా బుర్ర తినేస్తున్నారు (నవ్వుతూ) అంటూ పూరి తెలిపారు.

  English summary
  Watch Jiya Jile song Promo from Loafer Movie .featuring Varun Teja, Disha Patani , Revathi, Posani Krishna Murali.Loafer is directed by Puri Jagannadh , produced by C Kalyan under Sree Subha Swetha films. Sunil Kasyap Composed Music and edited by SR Sekkhar .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X