»   » అసలు టైటిల్ అదికాదు.... అవన్నీ నమ్మకండి: కళ్యాణ్ రామ్

అసలు టైటిల్ అదికాదు.... అవన్నీ నమ్మకండి: కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రానికి 'నట విశ్వరూపం' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఆయనకు జోడీగా నటిస్తున్నారు.

ఈ సినిమాకి 'నట విశ్వరూపం' అనే టైటిల్ పెట్టనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. యూనిట్ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన కాదు కనుక ఇది నిజం కాకపోవచ్చని కొంతమంది , ఇది సినిమా టైటిల్ లా అనిపించడం లేదనే అభిప్రాయాన్ని మరికొంతమంది వ్యక్తం చేసారు అయితే ఎ అనుమానమే నిజం అయ్యింది అసలు ఈ సినిమా పై తాము ఏ టైటిలూ అనుకోలేదనీ అనుకుంటే తామే స్వయంగా వెల్లడిస్తామని యూనిట్ తరఫున కళ్యాణ్ రామ్ చెప్పాడు.

Jr NTR 27th Movie Title Considered As Nataviswarupam ?

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్.. వంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ జోష్‌లో ఉన్నాడు ఎన్టీఆర్. జనతాగ్యారేజ్ వంటి బంపర్‌హిట్ సక్సెస్‌ను ఎంజాయ్ చేశాడు. మళ్లీ అంతటి బ్లాక్‌బస్టర్‌ను అందుకోవాలన్న తపనతో చాలా గ్యాప్ ఇచ్చాడు తారక్. ఆ గ్యాప్‌లో ఎన్నో కథలు విన్నాడు. వక్కంతం వంశీతో సినిమా చేయాల్సి ఉన్నా.. కథలో ఎక్కడో చెడి అది మూలన పడింది. ఆ తర్వాత ఎందరో డైరెక్టర్లు లైన్‌లో ఉన్నా.. పవన్ కల్యాణ్‌కు సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి అట్టర్ ఫ్లాప్‌ను ఇచ్చిన బాబితో సినిమాకు ఒప్పుకొన్నాడు జూనియర్. ఆ సినిమాలో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడతడు.

అయితే.. ఆ సినిమాకు 'నట విశ్వరూపం' అన్న టైటిల్‌ను పెడుతున్నట్టు కథనాలు వచ్చాయి. టైటిల్ ఏం బాగాలేదంటూ తారక్ అభిమానులు కొంత అసహనానికి లోనయ్యారు. ఇప్పుడు ఆ టైటిల్‌పై తారక్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ వివరణ ఇచ్చాడు. ఇంకా సినిమాకు ఏ టైటిల్ పెట్టలేదని తేల్చి చెప్పేశాడు. టైటిల్ కానీ, నటీనటుల గురించి కానీ, టెక్నికల్ టీమ్ గురించి కానీ.. ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, తీసుకుంటే కచ్చితంగా చెబుతామని కుండ బద్దలు కొట్టేశాడు.

English summary
Nandamuri Kalyan Ram says Jr NTR 27th Movie Title Considered As Nataviswarupam is a rumour
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu