For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్ : 'జస్టిస్‌ చౌదరి' గెటప్‌లో ఎన్టీఆర్

  By Srikanya
  |

  హైదారాబాద్ : తరాలు మారుతున్నా పెద్ద ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ తగ్గటం లేదని మరోసారి 'బాద్‌షా' చిత్రం ప్రూవ్ చేయనుంది. 'బాద్‌షా'లో జస్టిస్‌చౌదరి గెటప్‌లో కనిపించబోతున్నాడు. విశ్రాంతి తర్వాత వచ్చే ఈ ఎపిసోడ్‌లో ఐదు నిమిషాలపాటు తన అభిమా నుల్ని అలరించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయమై నిర్మాత బండ్ల గణేష్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. మీడియావారు అడిగితే... నో కామెంట్స్ అని తప్పించుకున్నారు.

  మొదట్నుంచీ జూనియర్ ఎన్‌టిఆర్ సీనియర్‌ను అనుసరిస్తూ..అవసరమొచ్చినప్పుడు ఆ గెటప్ లతో అదరకొడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆది, సింహాద్రి సినిమాల్లో ఎన్‌టిఆర్ కృష్ణుని గెటప్పుల్ని వాడుకున్న జూనియర్ యమదొంగ చిత్రంలో అయతే సీనియర్‌ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా సృష్టించి, ఆయనతో డైలా గ్ చెప్పే సన్నివేశానే్న క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ఇటీవల ఓ యాడ్‌లోనూ బడిపంతులు చిత్రం వేషంలోనూ కనిపించాడు.

  ఇక 'దమ్ము' చిత్రం తర్వాత ఎన్.టి.ఆర్ న టిస్తున్న చిత్రం 'బాద్‌షా'. శ్రీనువైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్.టి.ఆర్‌కు జోడీగా ఈ చిత్రంలో అందాల సుందరి కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బ్రహ్మా నందం, ఎమ్మెస్ నారాయణ, జయ ప్రకాష్‌రెడ్డిపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని
  బాగా నవ్విస్తాయం టున్నారు.

  'బాద్‌షా' చిత్రానికి సంబంధించి ఆడియో ఇటీవల విడుదలై పాటలకు మంచి స్పందన లభించిందని, థమన్ శ్రోతలను అలరించే స్థాయిలో సంగీతాన్ని అందించారని ఆయన తెలిపారు. యుఎస్‌లో కూడా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్.టి.ఆర్ అభిమానులేకాక అక్కడి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఎన్.టి.ఆర్ లుక్స్, స్టయిల్, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్టయ్యే రేంజ్‌లో చిత్రం రూపొందిందని, యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్‌టైనర్ కలగలిపి ఈ బాద్‌షా ఉంటుందని, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

  English summary
  jr.NTR is all set to appear in his grandfather’s legendary Justice Chowdary get-up in the upcoming ‘Baadshah’. T-town producers know well how to cash in on the legacy of the legendary NTR. After dancing with a computer generated NTR in a song in “Yamadonga”, Jr NTR will be seen in his grandfather's famous Justice Chowdary get-up in the upcoming film ‘Baadshah’. “It will be a special episode post interval and the 5 to 6 minute appearance is bound to make NTR fans go berserk,” says a source in the crew. However, producer Bandla Ganesh is tight-lipped about the “special appearance“. “No comments,” he cuts short.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X