»   » తను ప్రాణాలు తోడేసింది, ఆ ప్రభావం పడకూడదనే: "బిగ్ బాస్" యంగ్ టైగర్ ఇలా చెప్పాడు

తను ప్రాణాలు తోడేసింది, ఆ ప్రభావం పడకూడదనే: "బిగ్ బాస్" యంగ్ టైగర్ ఇలా చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' షో అతి త్వరలో రానుంది. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లో 'బిగ్‌బాస్' షోను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఎన్టీఆర్ ముచ్చటించారు. హిందీ లో వచ్చిన బిగ్ బాస్ షో మీరు చూసారా అన్న ప్రశ్నకు సమాధానం గా ఇలా చెప్పాడు ఎన్టీఆర్

నేను చూడలేదండీ.

నేను చూడలేదండీ.

‘‘నేను చూడలేదండీ. కాకపోతే నాకు కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది. నేను ఓ రోజు షూటింగ్‌కు అని బయటకు వెళ్లబోతుంటే తను భయంకరమైన సౌండ్ పెట్టుకుని రిపీట్ షో ఏదో చూస్తున్నట్టుంది. సల్మాన్‌ఖాన్ గారు ఎవరిమీదో సీరియస్ అయ్యారట.. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ‘నీకు తెలుసా బిగ్‌బాస్ తిట్టేశాడు.' అంది.

బిగ్‌బాస్ తిట్టడమేంటి?

బిగ్‌బాస్ తిట్టడమేంటి?

బిగ్‌బాస్ తిట్టడమేంటి అన్నా. బిగ్‌బాస్ గురించి అప్పుడే అర్థమైంది. బిగ్‌బాస్ తిట్టడమేంటి?.. హో.. సల్మాన్ ఖాన్ తిట్టాడా? అని అడిగితే.. కాదు.. కాదు బిగ్‌బాస్ వేరు.. సల్మాన్‌ఖాన్ వేరు. సల్మాన్ తిట్టేశాడు. అసలు మామూలుగా అయితే బిగ్‌బాస్ తిట్టాలి. సల్మాన్ తిట్టాడు అని చెప్పి అదేదో ప్రపంచంలో ఒక వింత జరిగిపోయినట్టు చెప్పింది.

ఎప్పుడూ చూడలేదు

ఎప్పుడూ చూడలేదు

ఆరోజు నేను బిగ్‌బాస్ గురించి విన్నా. అక్కడక్కడా ఒక రెండుమూడు ఎపిసోడ్లు చూడ్డమే తప్ప కంటిన్యూయస్‌గా ఎప్పుడూ చూడలేదు. కాకపోతే తెలిసింది ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి బిగ్‌బాస్ గురించి ఒక అభిప్రాయం ఉంది. అన్ని ఎపిసోడ్లు చూసేశాం అనుకోండి అది మన మీద ప్రభావం చూసే అవకాశం ఉంది.

సో.. అదన్న మాట.

సో.. అదన్న మాట.

అందుకే అది లేకుండా ఫ్రెష్‌గా ఏమీ చూడకుండా వెళితే మనకు ఏం చేయాలనిపిస్తుందో అది చేయొచ్చు. సో.. అదన్న మాట.'' అని తారక్ చెప్పాడు. ఈ షో ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా ఆ కజిన్ కే చెప్పాడట. వెంటనే " నువ్వు చెయ్యి అంటూ ప్రాణం తీసింది" అని చమత్కారంగా చెప్పాడు యంగ్ టైగర్

ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం.

ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం.

‘‘నాకు ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. నాకసలు టీవీలో హోస్ట్‌గా ఎలా బిహేవ్ చేయాలని కానీ, ఎలా మాట్లాడాలని కానీ, ఎలా నటించాలని కానీ తెలీదు. అసలు ఏ క్లూ లేదు. ఎప్పుడూ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఒప్పేసుకున్నాను అంటూ చెప్పిన తారక్ ఇంకా చాలా విషయాలే చెప్పాడు ఆ పూర్తి వివరాలు ఫిల్మీబీట్ లో ఇంకాసేపట్లో మీ ముందుంటాయి.

English summary
Bigg Boss Telugu, which will mark Jr NTR's debut as a TV host, is set to become the most expensive show to be produced in Telugu television
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu