»   » శుభవార్త: జూ ఎన్టీఆర్ తండ్రయ్యాడోచ్!

శుభవార్త: జూ ఎన్టీఆర్ తండ్రయ్యాడోచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి అభిమానులకు శుభవార్త. యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డను ప్రసవించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ వార్తతో జూ ఎన్టీఆర్ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.

2011లో జూ ఎన్టీఆర్ వివాహం లక్ష్మి ప్రణతితో జరిగిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం క్రితమే లక్ష్మి ప్రణతి గర్భవతి అయిన విషయం బయటకు వచ్చింది. శుభవార్త కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి కావడంతో వారి ఎదురు చూపులు నేటితో పూర్తయినట్లయింది.

స్లైడ్ షోలో జూ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతికి సంబంధించిన విశేషాలు.

జూ ఎన్టీఆర్ అరేంజ్డ్ మ్యారేజ్

జూ ఎన్టీఆర్ అరేంజ్డ్ మ్యారేజ్

టాలివుడ్‌ నటుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ప్రేమ వివాహం కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నారు. తమ బంధువైన నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మి ప్రణతిని పెళ్లాడారు.

 వైభవంగా వివాహం

వైభవంగా వివాహం

జూ ఎన్టీఆర్ వివాహం మే 5, 2011లో హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

లక్ష్మి ప్రణతి

లక్ష్మి ప్రణతి

లక్ష్మి ప్రణతి ప్రణతి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మేనకోడలి కుమార్తె కావడం కూడా విశేషం. ఆమె తండ్రి నార్నె శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్టర్లలో ఒకరు.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్ ప్రస్తుతం రభస చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈచిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

English summary
Jr NTR blessed with a baby boy. NTR’s wife, Lakshmi Pranathi delivered a hale and healthy baby just a while ago at Rainbow Hospital in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu