»   » ఈ దశాబ్దపు సంచలన హీరో జూ ఎన్టీఆర్...

ఈ దశాబ్దపు సంచలన హీరో జూ ఎన్టీఆర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సందేహం లేదు..ఈ దశాబ్ధంలో తెలుగు సినిమాలపై పెను ప్రభావాన్ని చూపిన హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతున్న మొదటి అయిదారుగురు హరోల లిస్ట్ లో కూడా జూ ఎన్టీఆర్ అగ్రభాగాన ఉండడమే అందుకు కారణం. జూ ఎన్టీఆర్ సినీ కెరీర్ పరంగా చూస్తే స్టూడెంట్ నెం1, ఆది, సింహాద్రి, యమదొంగ, అదుర్స్, చిత్రాలతో పాటు ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'బృందావనం" కూడా హిట్ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఒక హీరో అనుభివిస్తున్న తారాపధానికి అతను తీసుకున్న పారితోషికమే ప్రాతిపదిక అనుకుంటే ఆరకంగా కూడా ఎన్టీఆర్ నేడు టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లోనే ఉన్నారని చెప్పొచ్చు.

తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు దర్శకత్వంలో నటనలో అక్షరాభ్యాసం చేసి బాలరాముడిగా 'రామాయణం" చిత్రంలోనే తన ప్రతిభన నిరూపించుకుని ..'నిన్ను చూడాలని" చిత్రంతో హీరోగా 2000 లో రంగప్రవేశం చేసిన జూ ఎన్టీఆర్ ఆ తర్వాత నుంచి తను నటించిన ప్రతి చిత్రంతో పదేసి మెట్లు ఎక్కుతూ వచ్చారు. నటుడిగా సరిగ్గా ఒక దశాబ్దం పూర్తి చేసుకున్న జూ ఎన్టీఆర్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. బహుశా అతని తాజా చిత్రం 'శక్తి" పెళ్లి కానుకగా విడుదల కావచ్చు...మరి జూ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఒక్క దశాబ్దం పూర్తి చేసుకొన్న సందర్బాంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని అద్బుతమైన సినిమాలను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu