»   » ఎన్టీఆర్ కు ముద్దు పెట్టి మరీ,ఎన్టీఆర్‌ ఇంత ఎమోషనల్ గా ఎప్పుడూ (వీడియో)

ఎన్టీఆర్ కు ముద్దు పెట్టి మరీ,ఎన్టీఆర్‌ ఇంత ఎమోషనల్ గా ఎప్పుడూ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : శుక్రవారం జరిగిన జనతాగ్యారేజ్ ఆడియో వేడుకలో ఎన్టీఆర్‌కు ముద్దు సీన్ కనువిందు చేసింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ముద్దు పెట్టింది ఎవరంటారా..ఆయన ఓ బడా నిర్మాత. ఆ నిర్మాత మరెవరో కాదు... టాలీవుడ్‌లో పాపులర్ అయిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ).

ఇక జనతా గారేజ్ ఆడియో రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఆయన అభిమానులకు చాలా ఉత్పేరికంగా ఉన్నాయి. ముఖ్యంగా అభిమానులతో రుణం తీర్చుకోవటం గురించి అంశాలు సోషల్ మీడియాలో షేర్లు అవుతున్నాయి. ఆయన పూర్తి ప్రసంగ పాఠాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు.ఎన్టీఆర్ మాట్లాడుతూ...'ప్రతిసారీ మీ రుణం తీర్చుకోవచ్చని అనుకుంటాను కానీ.. తీర్చకుండానే వెళ్లిపోయి మళ్లీ పుడతానేమో.. కొన్ని సార్లు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనేమో అనిపిస్తుంటుంది.


ఎప్పుడు చేసుకున్న అదృష్టమో అద్భుతమైన తల్లిదండ్రులకు కొడుకుగా, మహానుభావుడి మనవడిగా పుట్టాను. చిన్న వయసులోనే విజయం రుచి చూశాను. ఆ తర్వాత కాస్త ఇబ్బందులు పడ్డాను. నేను అపజయాలతో ఉన్నప్పుడు మీరంతా ఎంత బాధపడ్డారో నేను తెలుసుకున్నానని' అభిమానులనుద్దేశించి ఎన్టీఆర్‌ అన్నారు.


వెలుగుచూసా,సమీపించా

వెలుగుచూసా,సమీపించా

‘టెంపర్‌'తో చిన్న వెలుగు చూశాను. నా గమ్యానికి దగ్గరయ్యాను. ఆ తర్వాత ‘నాన్నకు ప్రేమతో'తో ఇంకా సమీపించాను. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్‌'తో నా గమ్యానికి మరింత దగ్గరయ్యానని' యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అన్నారు.రెండేళ్ల క్రితమే...

రెండేళ్ల క్రితమే...

‘రెండేళ్ల ముందే కొరటాల శివ ఈ కథ చెప్పాడు. అప్పుడు బిజీగా ఉండి చేయలేకపోయాను. పుష్కరం తర్వాత నేనివ్వబోయే పెద్ద హిట్టు శివ ఇస్తాడేమో అనుకున్నాను. ఆయనొక గొప్ప రచయిత. ఎంచుకున్న వ్యక్తితో తప్ప ఇంకెవ్వరితోనూ సినియా తీయరు.వ్యక్తిత్వం ఉన్న

వ్యక్తిత్వం ఉన్న

గొప్ప మనిషి, వ్యక్తిత్వం కలిగిన మోహన్‌లాల్‌తో ఆర్నెలు గడిపేలా శివ నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు.


దేవిగురించి

దేవిగురించి

దేవిశ్రీ గురించి ఎన్ని సార్లైనా ఒక్కటే చెప్తాను. అతడికి పని తప్ప ఇంకో ధ్యాస ఉండదు'అన్నారు.


దేవుణ్ణి చెయ్యద్దు

దేవుణ్ణి చెయ్యద్దు

అభిమానులు చూపిస్తున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తాను ఒక సాధారణ మనిషిని మాత్రమేనని తనను దేవున్ని చేయొద్దని అభిమానులకు సూచించారు.బాధకలిగింది

బాధకలిగింది

నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సందర్భంగా కొంత మంది తన చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడం బాధ కలిగించిందన్నారు.


తమ్ముడ్ని,అన్నను

తమ్ముడ్ని,అన్నను

అభిమానుల ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతూ.. అభిషేకాలు, పూజలు దేవునికి మాత్రమే చేయాలని తాను దేవున్ని కాదని, నేను మీకు తమ్మున్ని, అన్నను అని అన్నారు.


పంపిణీ చెయ్యండి

పంపిణీ చెయ్యండి

పాలను వృధా చేయడం కంటే అనాథ ఆశ్రమంలోని పిల్లలకు, నిరుపేదలకు పంపిణీ చేయాలని చెప్పారు.


బలులు వద్దు

బలులు వద్దు

అలాగే సినిమా విడుదల సందర్భంగా థియేటర్లలో జంతువులను బలివ్వడం కంటే అన్నదానం చేస్తే తాను ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జనతా గ్యారేజ్ సినిమాలోని డైలాగులను చెప్పి అలరించారు.


ఇద్దరితో హ్యాపీ

ఇద్దరితో హ్యాపీ

సమంత, నిత్య మేనన్‌తో పనిచేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. సాంకేతిక నిపుణులు బాగా పనిచేశారన్నారు. సాయికుమార్‌, బ్రహ్మాజి, అజయ్‌తో నటించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.


తెలుగుతనం రుచి

తెలుగుతనం రుచి

పుష్కరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చే భక్తులను సాదరంగా ఆహ్వానించి వారికి తెలుగుదనం రుచిచూపించాలని అభిమానులను కోరారు.


English summary
When NTR entered the auditorium where the audio of his new film ‘Janatha Garage’ was being released in Hyderabad, just like the fans, all the producers, and directors in the front row got euphoric and competed to wish him first.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu