»   » గుంటలో పడ్డ ఎన్టీఆర్...కోపంతో ఏం చేసాడో తెలుసా?

గుంటలో పడ్డ ఎన్టీఆర్...కోపంతో ఏం చేసాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిట్ కొట్టిన డైరెక్టర్లతో చేస్తే సక్సెస్ బాట పడతాం...ఇండస్ట్రీలోని హీరోలంతా దాదాపుగా ఇలా ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ఈ సూత్రం బాగానే పని చేసినా, చాలా సందర్భాల్లో అంచనాలు తప్పుతాయి. కథలో దమ్ము, కథనంలో పర్‌ఫెక్ట్‌నెస్ ఉంటే తప్ప విజయతీరాన్ని చేరుకోలేం అనే ప్రాథమిక సూత్రాన్ని మంచిపోతారు చాలా మంది స్టార్స్.

తాజాగా యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' సినిమా విషయంలో ఇలానే చేసాడు. కథను నమ్ముకోకుండా గబ్బర్ సింగ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు హరీష్ శంకర్‌ను గుడ్డిగా నమ్మాడు. చివరకు పరాజయం అనే గుంటలో పడ్డాడు. అప్పుడుగానీ జూ ఎన్టీఆర్‌కు జ్ఞానోదయం కాలేదు.

ఓటమి పాలైన కోపంలో ఉన్న జూ ఎన్టీఆర్ తన పర్సనల్ మేనేజర్‌ను తొలగించాడట. 'రామయ్యా వస్తావయ్యా' సినిమా విషయంలో అతగాడి వల్లనే రాంగ్ స్టెప్పులేసాననేది జూ ఎన్టీఆర్ భావన అని ఫిల్మ్ నగర్ టాక్. ఇకపై ఎవరినీ నమ్మకండా తన మనస్సాక్షిని, కథను నమ్ముకునే సినిమా చేయాలనే ఆలోచనకు వచ్చాడట యంగ్ టైగర్.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'రభస' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాద్ షా చిత్రం నుంచి ఖాళీ లేకుండా షూటింగుల్లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. బాద్ షా పూర్తయిన వెంటనే.. రామయ్యా వస్తావయ్యా...ఆ వెనువెంటనే 'రభస' షూటింగులో జాయినైయ్యాడు.

English summary
Jr NTR focuses ahead after the debacle of 'Ramayya Vastavayya'. Jr NTR has decided to mend his ways, and the first thing that he has decided to do is to sack his manager, read the scripts himself, and not to go by the director’s previous success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu