»   » హరికృష్ణ కోసం బాబాయ్ బాలయ్యను పక్కకు నెట్టిసిన జూ ఎన్టీఆర్..!

హరికృష్ణ కోసం బాబాయ్ బాలయ్యను పక్కకు నెట్టిసిన జూ ఎన్టీఆర్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ హరీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెల్సిందే. త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో హరికృష్ణ, టీడిపీ ఎంపిగా 'రాజకీయ బాద్యతలు" నిర్వహిస్తున్నారు. టిడిపిలో అంతర్గత కుమ్ములాటలనీ, హరికృష్ణ టిడిపిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారనీ ఓ పక్క వార్తలొస్తోంటే, రాజకీయాల్నీ కాస్త పక్కన పెట్టి, సినిమాల్లో నటించాలని హరికృష్ణ డిసైడ్ అవడం గమనార్హం.

గతంలో సోలో హీరోగా ఓ నాలుగైదు సినిమాలు చేసిన హరికృష్ణ గత కొద్ది రోజులుగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నీమద్యనే తనయుడు జూ ఎన్టీఆర్ పెళ్ళిలో హడావిడి చేసిన హరికృష్ణ, మళ్ళీ నటించాలని వుందనే కోరిక బటపెట్టడం, ఎన్టీఆర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాట. వాస్తవానికి జూ ఎన్టీఆర్ సినిమాలో బాలయ్య గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారంటూ, ఈ మేరకు బాలయ్యను ఒప్పించే పనిలో బిజీగా ఉన్న బోయపాటి, హరికృష్ణ స్వయంగా రీ ఎంట్రీ కోసం అడగడంతో బాలయ్య మేటర్ ని పక్కన పెట్టేసిట్లు సమాచారం.

English summary
Ntr already had Surender Reddy’s ‘Rachcha’ in construction and now there is a news in T-town that Ntr signed a new project with Boyapati Srinu who has a super hit with his last directorial, Simha. This flick is likely to be produced by KS Rama Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu