»   » ఒకే వేదికపై ఎన్టీఆర్ క్లాప్..కెసీఆర్ పూజ ( ఫోటోలతో...)

ఒకే వేదికపై ఎన్టీఆర్ క్లాప్..కెసీఆర్ పూజ ( ఫోటోలతో...)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఆది హీరో గా శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ ప్రీతిసింగ్‌ హీరోయిన్. శ్రీహరి ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సి.హెచ్‌.సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవరం అభిలాష్‌ నిర్మాత. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో సినీ,రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది.

  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పూజా కార్యక్షికమాలు నిర్వహించి సంస్థ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆది, శ్రీహరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ నివ్వగా, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), రమేష్ పుప్పాల గౌరవ దర్శకత్వం వహించారు.

  'ఈగ' తర్వాత సెంథిల్‌కుమార్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. మణిశర్మ ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేశారు. శ్రీహరి, ఆది మధ్య సన్నివేశాలు సినిమాకు కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తన పాత్ర రఫ్ గా ఉంటుందంటున్నాడు హీరో ఆది.

  ముహూర్తపు సన్నివేశానికి స్టార్ హీరో ఎన్టీఆర్‌ క్లాప్‌నిచ్చారు. నల్లమలుపు బుజ్జి, రమేష్‌పుప్పాల కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

  తెరాస అధినేత కేసీఆర్‌, సాయికుమార్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వి.వి.వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''బుల్లెట్‌, రాకెట్‌... ఈ రెండూ దూసుకుపోవడమే తప్ప వెనుతిరిగి చూసుకోవు. ఈ చిత్రంలో మా హీరో తీరు కూడా అలాగే ఉంటుంది. తను ప్రేమించిన యువతి కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. మాస్‌ అంశాలకు ప్రాధాన్యమున్న ఓ మంచి కథ ఇది. సెంథిల్‌కుమార్‌, మణిశర్మ లాంటి సాంకేతిక బృందంతో కలిసి పనిచేస్తుండటం ఎంతో ఆనందాన్నిస్తోంది'' అన్నారు.

  ''దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమవుతుంది''అన్నారు శ్రీహరి.

  ''ఈగ తర్వాత నేను పనిచేస్తున్న చిత్రమిదే. కథకు ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకొన్నారు దర్శకుడు. ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు ఛాయాగ్రహకుడు కె.కె.సెంథిల్‌కుమార్‌.

  '' కమర్షియల్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యమున్న కథ ఇది. ఇందులో నా పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. శ్రీహరితో కలిసి నటిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది''అన్నారు హీరో ఆది.

  ‘మా సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రమిది. సుబ్బాడ్డి చక్కటి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు నిర్మాత.

  ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, తనికెళ్ళ భరణి, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటిస్తున్నారు. మాటలు: మరుధూరి రాజా, పాటలు: భాస్కరభట్ల, చంద్రబోస్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మరుధూరి వినోద్‌.

  English summary
  
 TRS Supremo K Chandrasekhara Rao and TDP youth leader and Young Tiger NTR, who came as chief guests for the movie launch of Sai Kumar's son Aadi on Sunday. And Young Tiger NTR has been invited by actor Sai Kumar as this movie launch also marks the birthday of his doting son Aadi. Considering two big wig chief guests, the organizers took utmost care in order to avoid collision. So the producers have called the TRS chief for a different time and Young Tiger for another time.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more