»   » 'ఊసరవిల్లి' ఆడియో వాయిదా తేది

'ఊసరవిల్లి' ఆడియో వాయిదా తేది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్ లో సురేంద్ర రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'ఊసరవిల్లి'. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 12వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. మొదట ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 11న అనుకున్నారు కానీ ఆ రోజు వినాయిక నిమజ్జనం రావటంతో దాన్ని మార్చుకున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రయాణంలో మంచు మనోజ్ ప్రక్కన చేసిన పాయిల్ ఘోర్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఈ చిత్రాన్ని నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పగను హీరో తన శక్తులన్నీ ఒడ్డి తీరుస్తాడని, గజనీలాంటి గమ్మత్తైన పాయింట్ తో ఈ చిత్రం స్క్రిప్టు రెడీ అయిందైని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. యాక్షన్ కలగలిసిన లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనతో ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నాడంటున్నారు. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. అలాగే సురేంద్రరెడ్డి కిక్ విజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.

English summary
The makers of the film earlier planned for Oosaravelli audio launch on Sep 11th but as that day is much auspicious as it is Ganesh immersion day(Lord Vinayaka Nimarzanam), so Oosaravelli music release postponed for a day and releasing on Sep 12th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu