»   » ఊసరవెల్లి పబ్లిక్ టాక్...మరి కొద్దిసేపట్లో రివ్యూ...!?

ఊసరవెల్లి పబ్లిక్ టాక్...మరి కొద్దిసేపట్లో రివ్యూ...!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  భారీ అంచనాలతో ఈ రోజు విడుదల అయిన ఊసరవెల్లి చిత్రం తొలి షో కువైట్ లో పడింది. అలాగే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో కొందరు ప్రముఖులకి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ రెండు షోస్ నుంచి వినిపిస్తున్న టాక్ ని బట్టి సినిమా బాగున్నట్టే ఉంది. యావరేజ్ కంటే ఎక్కువే చెబుతున్నారు కానీ ఎవరూ సినిమా బాలేదని అనడం లేదు. రెగ్యులర్ షోస్ చూసే ఆడియన్స్ మాత్రం సినిమా ఏవరేజ్. ఫస్టాఫ్ సూపర్ అంటూ ఇంటర్వల్లో ఉత్సాహంగా ఫోన్లు చేసిన అభిమానులు.. సెకండాఫ్ చూశాక నీరసించిపోయారు.

  ఫస్టాఫ్ లో మూడు పాటలూ బాగుండటం, ముఖ్యంగా ఎన్టీఆర్ దాండియా పాటలో ఇరగదీయడం (వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్స్ పెర్ఫామెన్సెస్ ఇన్ ఎన్టీఆర్ కెరీర్ అని ఓ అభిమాని చెప్పాడు). మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉండటంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఉత్సాహంతో కనిపించారు. రఘుబాబుతో కలిసి ఎన్టీఆర్ కామెడీ ఇరగదీసినట్లు చెప్పారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ ట్విస్ట్ తో పాటు హీరో హీరోయిన్లు ఈ సినిమాకి ఎస్సెట్ అని అంటున్నారు.

  కానీ సెకండాఫ్ కు సీన్ రివర్సయింది. ద్వితీయార్ధంలో కిక్కున్న పాటల్లేకపోవడం, బోర్ కొట్టించే కథనం, రొటీన్ క్లైమాక్స్.. అన్నీ కలిపి ఊసరవెల్లిని హిట్టుకు తక్కువగా.. ఏవరేజ్ కు ఎక్కువగా నిలబెట్టాయట! సెకండాఫ్ లో హీరో కంటే కూడా హీరోయిన్ కు ప్రాధాన్యం ఎక్కువైందట. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ పరంగా చూసినా సెకండాఫ్ తేలిపోయినట్లు చెబుతున్నారు. ప్రథమార్ధంలో డిఫరెంట్ టేకింగ్ తో అదరగొట్టిన సురేందర్ రెడ్డి.. సెకండాఫ్ లో తనదైన మార్కు చూపించలేకపోయాడని, రొటీన్ సీన్స్ తో బండి లాగించేశాడని అభిమానులు అన్నారు.

  (పూర్తి స్థాయి రివ్యూ.. మరి కొద్దిసేపట్లో....)

  English summary
  Jr.NTR’s Oosaravelli that has released worldwide today and has completed its first shows in major areas and here is the first report talk of the film. Jr.NTR steals the show and Tamanna is surely an asset for the film. She did a good job with her performance. NTR’s dances, comedy and his dialogue delivery are plus for the film. The first half of the film is impressive with more entertaining elements like comedy, twists, colorful songs and good interval bang.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more