»   » అలా పీలయ్యే వ్యక్తులు రవన్న, కళ్యాణ్ అన్న మాత్రమే: జూ ఎన్టీఆర్

అలా పీలయ్యే వ్యక్తులు రవన్న, కళ్యాణ్ అన్న మాత్రమే: జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొంత మంది పైకొస్తే మనసుకు ఆనందంగా ఉంటుంది. ఇక్కడ నేను అలా పీలయ్యే వ్యక్తులు రవన్న, కళ్యాణ్ అన్న మాత్రమే అని వ్యాఖ్యానించారు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్. శనివారం సాయంత్రం ‘కిక్-2' ఆడియో వేడుకకు ముఖ్యగా విచ్చేసిన ఎన్టీఆర్ సీడీ ఆవిష్కరణ అనంతరం ఆయన రవితేజ, కళ్యామ్ గురించి మాట్లాడారు.

సీతారామ రాజు షూటింగ్ టైములో నిక్కర్లు వేసుకుని షూటింగ్ స్పాట్ కు వెళ్లే వాడిని. అప్పటి నుండి రవితేజగారు నాకు తెలుసు. కేబీఆర్ పార్కులో రన్నింగుకు వెళ్లే సమయంలో రవితేజతో రెండోసారి పరిచయం ఏర్పడింది. నేను ఒక రౌండ్ పరుగెత్తేలోపు ఆయన రెండు రౌండ్స్ వేసేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి నటుడిగా మారి, ఇండస్ట్రీలో ఒక అగ్రకథానాయకుడిగా ఎదిగారు. ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు. ఆయన ఎప్పుడూ ఇలానే ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తూ ఉండాలి, మంచి సినిమాలు చేయాలి అన్నారు.


Jr NTR praises Ravi Teja

కళ్యాణ్ అన్నయ్య చాలా కష్టపడే వ్యక్తి. పేర్లు చెప్పుకోవడం కాదు..కష్టపడాలి అని అనుకుంటారు. ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ తనయుడిగా ఎప్పుడూ ఫీల్ కారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. సూరి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కాకుండామా ఫ్యామిలీలో మనిషిగా చూస్తాం. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలు వేరు, కిక్-2 సినిమా వేరు. దర్శకుడిగా పది మెట్లు పైకి ఎక్కించే సినిమా ఇది. పటాస్, టెంపర్ సినిమాల తర్వాత వస్తున్న కిక్-2 సినిమాతో అన్నయ్య ముఖంలో చిరునవ్వు అలాగే ఉండాలి అన్నారు.

English summary
Kick 2 Audio Release function held at Hyderabad. Jr NTR Participated as chief guest.
Please Wait while comments are loading...