twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఊసరవెల్లి’ నెగెటివ్, కానీ...: జూ ఎన్టీఆర్

    By Bojja Kumar
    |

    ఊసరవెల్లి అంటే.. చాలా మంది నెగెటివ్ గా ఆలోచిస్తారు. రంగులు మార్చి మోసం చేసే రకం అంటుంటారు. పాపం అది సాదు జంతువే అయినా అది బ్రతకడం కోసం రంగులు మార్చక తప్పని పరిస్థితి.....మరి 'ఊసరవెల్లి" సినిమాలో హీరో ఎందుకు మార్చాడో? థియేటర్లో చూడాల్సిందే....అన్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ నెల 6న తన సినిమా విడుదల సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మట్ లో జూనియర్ మాట్లాడారు. రంగులు మార్చినంత మాత్రాన చెడ్డ వారు కాదని, మంచి పనులు చేయడానికి కూడా ఒక్కోసారి రంగులు మార్చక తప్పదు అన్నారు.

    తనకు విజయదశమి సినిమా బాగా కలిసొచ్చిందని, తన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ నె.1 సెప్టెంబర్ 27న విడులై సూపర్ హిట్టయింది. బృందావనం కూడా పోయిన దసరాకు విడుదలై మంచి విజయం సాధించింది. అదే తరహాలో ఊసరవెల్లి సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడి సుందర్ రెడ్డితో పాటు అంతా చాలా కష్ట పడి పని చేశారని, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత పూర్తిగా సంతృప్తి చెందుతారన్నాడు. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దని, అంతా థియేటర్లోనే సినిమాలు చూడాలని కోరారు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....అసలు ఊసరవెల్లి టైటిల్ ను తారక్ ఒప్పుకుంటాడని అనుకోలేదు, సినిమా బాగా వచ్చింది, ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో ఉంటాయన్నారు. ఈ సమాశంలో నిర్మాత చత్రపతి ప్రసాద్ తో పాటు, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

    English summary
    ‘Don't Encourage Piracy’ Jr Ntr told in Oosaravelli press meet. He narrated about the Oosaravelli title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X