మళ్లీ గొడ్డలితో నరుకుడు ప్రారంభించిన జూ ఎన్టీఆర్
సినిమా కథలో ఈ గొడ్డలి ఫైట్ ఎంతో కీలకమైనది, ఇప్పటికే ఈ ఫైట్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ పార్ట్ ఎంతో బాగా వచ్చిందని, ఔట్ పుట్ చూసిన తర్వాత జూ ఎన్టీఆర్‌తో పాటు హరీష్ శంకర్ కూడా ఎంతో సంతృప్తిగా ఫీలయ్యారని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇటీవల కర్నాటకలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'రామయ్యా వస్తావయ్యా'...ఆ షెడ్యూల్లో రెండు పాటలతో పాటు కొన్ని టాకీ సీన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపనున్నారు. దిల్‌రాజు నిర్మాత. సమంతా, శృతిహాసన్ హీరోయిన్స్.
ఎన్టీఆర్ సెంటిమెంట్‌గా భావించే సెప్టెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాక్షిగహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.


Click it and Unblock the Notifications












