twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ ‘బాద్‌షా’: 3డేస్ వరకు నో టికెట్స్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'బాద్ షా' ఈ నెల 5న విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా టిక్కెట్లు కోసం అభిమానులు ఎగబడుతున్నారు. పలు చోట్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన థియేటర్లలో వీకెండ్ తొలి మూడు రోజులు టిక్కెట్స్ ఇప్పటికే అమ్ముడయినట్లు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో ముందుగా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా వీకెండ్‌లో 'బాద్ షా' సినిమా చూద్దామని థియేటర్లకు వెళితే మాత్రం నిరాశ తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్‌కు తోడు ఇది వరకు 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి శ్రీను వైట్ల దర్శకత్వం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    పలువురు సినీ ప్రియులు 'బాద్ షా' టిక్కెట్లు దక్కించుకోవడానికి ప్రయత్నించి విఫలయం అయ్యారు. తమ అనుభవాలను తమ తమ ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. సుబ్బు అనే అభిమాని తనకు ఎదురైన అనుభవం గురించి వెల్లడిస్తూ 'బాద్ షా టికెట్స్ బుక్ చేసుకుందామని వెళ్లాను. 7వ తేదీ వరకు టికెట్స్ అన్నీ అయిపోయాయి. షాకయ్యాను' అని ట్వీట్ చేసారు. కిరణ్ అనే మరో అభిమాని 'ప్రసాద్ ఐమాక్స్‌లో 21 షోల టికెట్స్ అయిపోయాయి' అని ట్వీట్ చేసారు.

    శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్ పై నిర్మించారు. ఏప్రిల్ 5న ఈచిత్రం గ్రాండ్ గా విడుదలవుతోంది. నైజాం ఏరియాలో 300కి పైగా థియేటర్లలో విడుదలవుతోంది. ఒక్క హైదరాబాద్ లోనే 100 థియేటర్లు కేటాయించారు. ఓవర్సీస్‌లో 210 స్క్రీన్స్‌లో ఈ చిత్రం రీలీజ్ అవుతోంది. 'బాద్ షా' చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

    English summary
    
 The fever of Telugu movie Baadshah starring Junior NTR and Kajal Aggarwal in leads, is fast gripping in Andhra Pradesh as it nears its release. The promos of the film have created so much hype that they have made the viewers go crazy and mad over the film. The tickets for first three days have been sold out hours after the advance booking opened. Many had to return home without getting tickets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X