For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్, బాలయ్య మధ్య రగులుతోన్న వివాదం?

  |

  కొన్నాళ్ళుగా బాలయ్యకీ- యంగ్ టైగర్ కీ కొల్డ్ వార్ జరుగుతుందన్న రూమర్ ఎలాగూ ఉంది. ఇప్పుడు మళ్ళీ యాదృచ్చికంగానో మరే కారణమో తెలీదు గానీ ఇంకోసారి ఈ వార్ తెరమీదకి వచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ మరోసారి బాలయ్య ఫాన్స్‌కి ఆగ్రహం తెప్పించాడట.

  ఎన్టీఆర్‌ కాపీ కొట్టాడా?

  ఎన్టీఆర్‌ కాపీ కొట్టాడా?

  అసలే సంబంధాలు సరిగా లేని నేపథ్యంలో తాజాగా 'పైసా వసూల్‌' దర్శకుడు పూరి జగన్నాథ్‌ వెళ్లి నేషనల్‌ మీడియాకి తను రెడీ చేసిన క్యారెక్టర్‌ని ఎన్టీఆర్‌ కాపీ కొట్టాడని న్యూస్‌ లీక్‌ చేసాడంటూ కొత్త రూమర్ వచ్చింది. ఇంతకీ జగన్ చేసాడా లేదా అన్నది పక్కా కాలేదు గానీ ఇప్పటికే నందమూరి అభిమానుల్లోని రెండు వర్గాల్లో మంటలు రాజుకుంటున్నాయి.

  జగన్‌ అభియోగం

  జగన్‌ అభియోగం

  జై లవకుశ లోని 'జై' పాత్ర తీరుతెన్నులు తను ఎన్టీఆర్‌కి చెప్పిన కథలోని పాత్రని పోలి వున్నాయనేది పూరి జగన్‌ అభియోగం అంటున్నారు. దీనిపై ఇంకా పూరి కానీ, ఎన్టీఆర్‌ కానీ అధికారికంగా స్పందించలేదు కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

  అభిమానులు కదిలిస్తే రెచ్చిపోయేలా ఉన్నారు

  అభిమానులు కదిలిస్తే రెచ్చిపోయేలా ఉన్నారు

  ఎక్కడినుంచి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయో గానీ ఇప్పుడు అభిమానులు మాత్రం కదిలిస్తే రెచ్చిపోయేలా ఉన్నారు. అసలే బాలయ్య సినిమాలకి తరచుగా పోటీగా వస్తోన్న జూనియర్‌ మీద కత్తులు నూరుతోన్న బాలయ్య ఫాన్స్‌కి ఇప్పుడు ఇది మరో ఆయుధంలా దొరికింది.

  ఎన్టీఆర్‌ కాపీ క్యాట్‌గా, స్క్రిప్ట్‌ చోర్‌ అంటూ

  ఎన్టీఆర్‌ కాపీ క్యాట్‌గా, స్క్రిప్ట్‌ చోర్‌ అంటూ

  ఎన్టీఆర్‌ని కాపీ క్యాట్‌గా, స్క్రిప్ట్‌ చోర్‌గా అభివర్ణిస్తూ జైలవకుశని బాయ్‌కాట్‌ చేయాలని కొన్ని అనధికారిక ఫేస్బుక్ గ్రూప్ల్లో పోస్టులు మొదలయ్యాయట. అక్కడ గొడవలు కూడా జరగటంతో కొన్ని పోస్టులు తొలగించారు. ఆ పోస్టుల్లో బాలయ్య సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌కి న్యాయం చేయాలని పిలుపునిస్తున్నారు.

  పర్సనల్ గా కూడా

  పర్సనల్ గా కూడా

  సాధారణంగా ఇలాంటి కథాచౌర్యం గొడవలు ఊరు, పేరు లేని రచయితలు, దర్శకుల నుంచి వస్తుంటాయి. కానీ ఇప్పుదు మంచి స్నేహితులు కూదా అయిన పూరీ, ఎన్టీఆర్ కి మధ్యే ఇలాంతి గొదవ అంతూ వార్తలు రావటం మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. ఫ్రొఫెషన్ పరంగానే కాదు పర్సనల్ గా కూడా పూరీ తారక్ లు మంచి స్నేహితులన్నది అందరికీ తెలిసిందే.

  నిజమో కాదో గానీ

  నిజమో కాదో గానీ

  కానీ పూరి జగన్నాథ్‌లాంటి పెద్ద డైరెక్టర్‌ ఈ మాట అనేసరికి ఇందులో వాస్తవం లేకపోలేదని నమ్మేస్తున్నారు. అయితే ఇది కేవలం గాసిప్‌గానే బయటకి వచ్చింది తప్ప పూరి అఫీషియల్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఆ పని కూడా చేసుంటే ఇక అభిమానుల గొడవలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర లేదు కదా. అసలు ఆ న్యూస్ నిజమో కాదో గానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ అయికూచుంది.

  దసరా బరిలో

  దసరా బరిలో

  ఇప్పటికే రణరంగం అవుతోంది అంటే ఇప్పుడు ఇంకో బాంబ్ కూడా పేలటానికి సిద్దంగా ఉంది. దసరాకి బాలకృష్ణ సినిమా రిలీజ్‌ అవుతుందనేది ఎప్పుడో ప్రకటించినా కానీ 'జై లవకుశ' చిత్రాన్ని దసరా బరిలో నిలపడం ద్వారా జూనియర్‌ ఎన్టీఆర్‌ మరోసారి బాలయ్య ఫాన్స్‌కి ఆగ్రహం తెప్పించాడు. ఇక ఈ దసరా కురుక్షేత్రం ఎలా ఉంటుందో చూడాలి.

  English summary
  Jr NTR's persona as Jai in his upcoming film Jai Lava Kusa is getting appreciation from everyone except director Puri Jagannadh. Rumours are rife that the director is not happy as the character looks like a copy of something that he had discussed with NTR last year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X