»   » జూ ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి ల కాంబినేషన్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

జూ ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి ల కాంబినేషన్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న రచ్చ చిత్రం నవంబర్ 17వ తేదీ నుంచి ముహూర్తం చేసారు..కానీ షూటింగ్ ప్రారంభించలేదు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రిభ్రవరిలో ప్రారంభించనున్నారు. ఇప్పటికి మూడు పాటలు రికార్డింగ్ పూర్తయ్యింది. షూటింగ్ కి వెళ్ళేలోగా మిగతా రెండు పాటలు రికార్డింగ్ పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్...శక్తి చిత్రం షూటింగ్ లలో బిజీగా పాల్గొంటున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్...రచ్చలోకి దూకుతాడు. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. అలాగే సురేంద్రరెడ్డి కిక్ విజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. తమన్నా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని బివిఎస్ యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక మొదట ఈ చిత్రానికి అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ఫిక్సయ్యి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.ఆ తర్వాత రచ్చ టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడా టైటిల్ కూడా ఉండేటట్లు కనపడటం లేదు. ఈ టైటిల్ ని వరుణ్ సందేశ్ తో ఏమైంది ఈ వేళ చిత్రం రూపొందించిన సంపత్ నంది అనే దర్శకుడు తనదేనంటూ, తను రిజిస్ట్రేషన్ చేసుకున్నానంటూ మీడియాకు ఎక్కారు. అతను ఈ రచ్చ అనే టైటిల్ ని ఓ మాస్ హీరోతో చేయటానికి పెట్టుకున్నానని, దానిని రిజిస్టర్ చేసి రెండుసార్లు రెన్యువల్ చేసానని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu