Don't Miss!
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
జై లవకుశ టీజర్ లీక్.. ఇంటర్నెట్‌లో వైరల్.. ఓ వ్యక్తి అరెస్ట్
టాలీవుడ్‌లో సినిమాలకు సంబంధించిన వీడియో లీకుల వ్యవహారం ఎక్కువైపోయింది. మొన్న అత్తారింటికి దారేది.. నిన్న బాహుబలి.. నేడు జై లవకుశ లీకుల బారిన పడ్డాయి. ఈ లీకుల బారి నుంచి తప్పించుకోవడానికి నిర్మాణ సంస్థలు స్వంతంగా ఎడిటింగ్ సూట్లను ఏర్పాటు చేసుకొంటున్నాయి. అయినా ఈ లీకుల దందాను నియంత్రించలేకపోవడం గమనార్హం. జై లవకుశ చిత్రానికి సంబంధించిన చిత్రాలను లీక్ చేసిన వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

ఇంటర్నెట్‌లో టీజర్ హల్‌చల్
ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న జై లవకుశ చిత్రానికి సంబంధించిన టీజర్‌లోని కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేశాయి. వెంటనే రంగంలోకి దిగి ఎక్కడ నుంచి లీక్ అయ్యాయి అనే విషయంపై దృష్టిపెట్టారు. లీక్ చేసిన వ్యక్తిని గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Recommended Video

|
అనుమానంతో ఓ వ్యక్తి అరెస్ట్
పోలీసుల ఫిర్యాదు మేరకు లీక్ వెనుక హస్తం ఉందనే అనుమానంతో గణేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కస్డడీలోకి తీసుకొని అతనిని ప్రశ్నిస్తున్నారు. అతను చెప్పే వివరాల ప్రకారం ఎక్కడ, ఎవరు లీక్‌కు ప్లాన్ చేసిన వివరాలు బయటకు పొక్కే అవకాశం ఉంది.

షాక్ గురైన చిత్ర యూనిట్
ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ప్రతిష్టాత్మకం జూలైలో టీజర్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టీజర్‌ను కట్ చేసే పనిలో ఉన్నారు. అంతలోనే ఈ టీజర్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం దిమ్మతిరిగిపోయింది.

అద్భుతంగా ఎన్టీఆర్ కారుదిగి వచ్చే సీన్లు
లీకైన వీడియోలో విశ్వ విశ్వపాలక, రావణ.. రావణ అనే పాట వస్తుంటే, ఎన్టీఆర్ పాత్ర కారుదిగి బయటకు రావడం కనిపిస్తుంది. వెనక రావణబ్రహ్మ పది తలకాయలు కనిపిస్తుంటే, దాని ముందు ఎన్టీఆర్ అలా అలా రైజ్ అవుతూ కనిపిస్తారు. ఈ చిత్రాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయేలా ఉన్నాయి.

రంజాన్‌కే అనుకొన్నారు. కానీ..
ఆ తర్వాత వచ్చే సన్నివేశంలో ఆధునిక, పౌరాణానికి కలిపి రూపొందించిన సింహాసనం, అందులో గొడ్డలి పట్టుకుని, భారీగా ఎన్టీఆర్ గట్టిగా నవ్వడం. ఆపై జై లవకుశ అంటూ ఇంగ్లీష్ అక్షరాలతో టీజర్ ముగుస్తుంది. బహుశా ఈ టీజర్‌ను రంజాన్‌కు రిలీజ్ చేద్దామని భావించారట. అందుకే టీజర్ ముగింపులో నెలవంక తదితర చిహ్నాలు కనిపించేలా చర్యలు తీసుకొనే ఉండవచ్చేమో అనే సందేహం కలుగుతున్నది. జై లవకుశ చిత్రం సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్నది.