»   » ఎన్టీఆర్ టైమ్ వచ్చింది...చూపిస్తున్నాడు

ఎన్టీఆర్ టైమ్ వచ్చింది...చూపిస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హిట్,ఫ్లాపులకు సంభంధం లేకుండా ఎన్టీఆర్ స్టామినా ఎప్పుడూ భాక్సాఫీస్ వద్ద ప్రూవ్ అవుతూనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ ..రభస బిజినెస్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కి టైమ్ స్టార్ట్ అయ్యింది...అది చూపిస్తున్నాడని దర్శక, నిర్మాత మురిసిపోతున్నారు. 35 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం నలభై కోట్ల వరకూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా నిర్మాతకు వచ్చిందని, రిలీజ్ కు ముందే ఐదు కోట్లు ఫ్రాఫిట్ లో ఉన్నాడని అంటున్నారు.

Jr NTR’s ‘Rabhasa’ has made profitable business

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో సాగుతోంది. ప్రస్తుతం చిత్రానికి సంభందించి నెగోషియేషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. ట్రేడ్ లో వినపడుతున్న వివరాల్లోకి వెళితే...


నైజాం - 12 కోట్లు

సీడెడ్ - 8.1 కోట్లు

కృష్ణా -2.5 కోట్లు

వైజాగ్ - 4.4 కోట్లు

నెల్లూరు - 1.9 కోట్లు

గుంటూరు - 3.85 కోట్లు

పశ్చిమ గోదావరి - 2.3 కోట్లు

తూర్పు గోదావరి - 2.5 కోట్లు

కర్ణాటక -3.73 కోట్లు

ఓవర్ సీస్ -4.25 కోట్లు

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary

 Jr NTR’s ‘Rabhasa’ has made profitable business much before to its release. The romantic action entertainer made with Rs 35 crore budget, however the distribution rights of AP itself fetched Rs 40 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu