»   » ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో ట్రాక్ లిస్ట్

‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో ట్రాక్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్వకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' సినిమా ఆడియో ఈ నెల 8న విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, పాటల రచయిత అనంత శ్రీరామ్ కలిసి 'జాబిల్లి నువ్వే చెప్పమ్మా' అనే పాటను కూడా విడుదల చేసారు.

తాజాగా ఈ చిత్రం ఆడియోకు సంబంధించిన ట్రాక్స్ లిస్ట్ వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం అందిన వివరాల ప్రకారం సినిమాలో 4 పాటలు ఉన్నట్లు స్పష్టం అవుతోంద.

1. జాబిల్లి నువ్వే చెప్పమ్మా
2. ఓ లైలానే వెళ్లా..
3. పండగ చేసుకో..
4. యంగ్ టైగర్..

ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పార్టు పూర్తి చేసుకుని విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెలలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రాన్ని మాస్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించారు. ఎన్టీఆర్ సరసన సమంత, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ తదితరులు ఇత పాత్రల్లో కనిపించనున్నారు. ఈచిత్రానికి కెమెరా : చోటా కె.నాయుడు, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్ : బ్రహ్మకడలి, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, నృత్యాలు : దినేష్, గణేష్, శేఖర్ బాను, పాటలు : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, సంగీతం : థమన్, సహ నిర్మాతలు : శిరీష్ లక్ష్మణ్, కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్.

English summary
Jr NTR’s “Ramayya Vastavayya” movie is getting ready to launch its audio in this month. Audio track List out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu