»   » ‘రామయ్యా వస్తావయ్యా' విడుదల తేదీ (అఫీషియల్)

‘రామయ్యా వస్తావయ్యా' విడుదల తేదీ (అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్‌శంకర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సమంతా, శృతిహాసన్ హీరోయిన్స్ . ఈ చిత్రం సెప్టెంబర్ 27(స్టూడెంట్ నెం.1 విడుదల తేదీ) న విడుదల చేయటానికి నిర్మాత దిల్ రాజు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన ప్రెస్ నోట్ తో మీడియాకు తెలియచేసారు. ఈ చిత్రంలో లో ఎన్టీఆర్‌ని ఓ డైనమేట్‌లా చూపించబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ...హరీష్ శంకర్ మా సంస్ధలో దర్శకత్వం చేయటం ఇదే తొలిసారి. ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయన పంచ్ డైలాగులు, ఎమోషన్ల్ లుక్స్ ఈ సినిమాకు హైలెట్ అవుతాయి. మాస్,యూత్ ,ప్యామిలీ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. వినోదానికి పెద్ద పీట వేసాం. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 27 న విడుదల చేస్తాం. ధమన్ మంచి బాణీలిచ్చారు. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం అని చెప్పారు.

అలాగే - ''ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే మైసూర్‌లో ఎన్టీఆర్, సమంత, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాం. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు. రామయ్య వస్తావయ్యా!' చిత్రంలోని ఎన్టీఆర్‌ డైలాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, దీనిపై దర్శకుడు హరీష్‌శంకర్‌ ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని అంటున్నారు.

లోగడ ఎన్టీఆర్‌తో 'బృందావనం' వంటి కుటుంబ కథాచిత్రాన్ని తీసిన దిల్‌రాజు దీనిని హైఓల్టేజ్‌ డ్రామాతో కనువిందుగా నిర్మిస్తున్నారు. ఇక 'మిరపకాయ్‌, గబ్బర్‌సింగ్‌' చిత్రాలతో అందరిదృష్టిని ఆకర్షించిన హరీష్‌శంకర్‌ ఈ చిత్రాన్ని అంచనాలకు తగ్గట్టుగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ఇందులోని డైలాగులు కూడా బాగా పేలుతాయని అంటున్నారు. యూత్‌, మాస్‌, ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట.

ఈ మధ్యనే ఎన్టీఆర్‌, సమంతల కాంబినేషన్‌లో అద్భుతమైన వినోదాత్మక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారని తెలిసింది. గద పట్టుకుని నిలుచున్న ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవలే విడుదలచేయగా, దానికి విశేషమైన స్పందన లభించిందని దర్శకనిర్మాతలు అన్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.

English summary
This news is offcial from the office of Dil Raju. Dil Raju’s another big film Ramayya Vastavayya starring NTR will release on 27 September (release date of Student No. 1) as per earlier plan. There will be a gap of two weeks between the biggies of the same producers which should be sufficient.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu