»   » ఎన్టీఆర్ సూపర్... (‘టెంపర్’ప్రివ్యూ)

ఎన్టీఆర్ సూపర్... (‘టెంపర్’ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ రూపొందిన చిత్రం టెంపర్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఆంధ్ర, తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా ఈ టెంపర్ ఫీవర్ కనపడుతోంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని ఎన్టీఆర్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రం ప్రీమియర్ షో లు పడుతూండటం విశేషం.

jr NTR's Temper preview

ఈ చిత్రంపై ఆసక్తి పెరగటానకి కారణాలు...

జూ. ఎన్టీఆర్ కొత్త గెటప్

ఇంతకుముందు వరకూ ఎన్టీఆర్ ఓవర్ వెయిట్ తో కనపడి విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఎన్టీఆర్ తన స్లిమ్ అవతారంతో చొక్కా విప్పి మరీ అందరిని ఆశ్చర్యపరిచారు.

పవర్ ఫుల్ కాంబినేషన్

పూరి జగన్నాథ్ ...క్యారక్టరైజేషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ కు పెట్టింది పేరు. అందులోనూ ఆంధ్రావాలా వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్లాప్ కావటంతో ఈ సినమాని బాగా కసిగా చేసాడని అంటున్నారు.

మూడో సారి లక్

కాజల్, ఎన్టీఆర్ హిట్ పెయిర్. వీరిద్దరూ గతంలో బృందావనం, బాద్షా చిత్రాలు చేసారు. ఇప్పుడు మూడో సారి టెంపర్ చిత్రం చేస్తున్నారు.


అనూప్ మ్యాజిక్

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి. తొలిసారి ఎన్టీఆర్, అనూప్ కాంబినేషన్ ఇది.

పోలీస్ సెంటిమెంట్

గతంలో ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో పోలీస్ గా కనిపించి అదరకొట్టారు. ఇప్పుడు మరోసారి ఫుల్ లెంగ్త్ పోలీస్ గాకనిపించనున్నారు. కాబట్టి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

హైదాబాద్ తో పాటు ఆంధ్ర, తెలంగాణలోని పలు నగరాల్లో కూడా ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడుతున్నాయి. ఈ బెనిఫిట్ షో టికెట్స్ కి కూడా పూర్తి స్దాయి క్రేజ్ ఉండడంతో, టికెట్స్ ధర కూడా బాగ పెంచేసారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల చూడడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ మరియు ఎన్.టి.ఆర్ ని చూపించిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో కష్టపడే బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించారు.


ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్‌'విడుదలకు సిద్గంగా ఉంది. 13న కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా విడుదల చేస్తాం . ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు.

చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూరి జగన్‌ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే రిపీట్‌ అయ్యింది.

బ్యానర్ : పరమేశ్వర ఆర్స్ ప్రొడక్షన్స్
నటీనటులు: ఎన్టీఆర్, కాజల్‌, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు
కథ: వక్కంతం వంశీ,
కెమెరా: శ్యామ్‌ కె నాయుడు,
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
ఆర్ట్‌: బ్రహ్మ కడలి,
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌,
ఫైట్స్‌: విజయ్‌,
సమర్పణ: శివబాబు బండ్ల,
నిర్మాత: బండ్ల గణేశ్‌,
స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
విడుదల తేదీ: 13, ఫిబ్రవరి 2015.

English summary
Temper is an action entertainer movie written by Vakkantham Vamsi and directed by Puri Jagannadh in which, Jr NTR and Kajal Aggarwal are playing the main lead roles along with Prakash Raj in negative role.
Please Wait while comments are loading...