»   » ఎన్టీఆర్‌ ఇన్నాళ్ళకు కరుణించాడు

ఎన్టీఆర్‌ ఇన్నాళ్ళకు కరుణించాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయాలంటే చాలా పోటీ ఉంటుంది. అయితే కథతో ఒప్పించుకుని, అతనితో సాన్నిహిత్యమున్న వక్కంతం వంశీ లాంటి రచయితకి అది అసాధ్యం మాత్రం కాదు. చాలా కాలం క్రితమే ఎన్టీఆర్ తో చిత్రం అని వక్కంతం వంశీ మీడియాకు తెలియచేసారు. అయితే ఎన్టీఆర్ వరసగా ప్రాజెక్టులు ఒప్పుకుంటూండటంతో అంతా ఎన్టీఆర్ ...వక్కంతం కు హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకోవటం మొదలెట్టారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వక్కంతం వంశీ ని ఆనంద పరిచారు.

'కిక్‌', 'వూసరవెల్లి', 'ఎవడు', 'రేసుగుర్రం'... ఇందులో కథ ఏదైనా సరే, కథానాయకుడి శైలికి సరిపడే వాణిజ్య అంశాల్ని మేళవిస్తూనే, ప్రేక్షకులకు కొత్తదనం రుచిచూపించాయి. వూహకందని మలుపులు ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ కథల్ని అందించి, ఆ చిత్ర విజయాల్లో కీలక పాత్ర పోషించారు వక్కంతం వంశీ. ఇప్పుడు ఈ రచయిత మెగాఫోన్‌ పట్టబోతున్నారు. అదీ.. ఎన్టీఆర్‌ సినిమాతో.

jr. NTR’s Vakkantam Vamsi project confirmed

ఆమధ్య ఎన్టీఆర్‌కి కథ వినిపించారు. అది ఎన్టీఆర్‌కి నచ్చడం, పచ్చజెండా వూపడం జరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించబోతున్నారు.

వక్కంతం వంశీ మాట్లాడుతూ... ''ఎన్నో యేళ్ల కల.. ఈ సినిమా. ఎన్టీఆర్‌ అభిమానులకు ఓ పండగలా ఉండబోతోంది. స్క్రిప్టు చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు చెబుతా'' అంటున్నారు వంశీ.

English summary
Script writer Vakkantam Vamsi, will soon turn director with NTR’s film, the news has been confirmed by the writer himself today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu