»   » పెళ్ళి పనులు చూసుకోవడం కోసం శక్తిని వేగవంతం చేసిన జూ ఎన్టీఆర్

పెళ్ళి పనులు చూసుకోవడం కోసం శక్తిని వేగవంతం చేసిన జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్ళి ముహూర్తం కుదిరింది. మే 5న వివాహం జరపాలని ఇరుకుటుంబీకులు నిచ్చయించుకున్నారు. పెళ్ళికి నెలరోజులపాటు సెలవు పెడతానని, షూటింగులకు స్వస్తి పలుకుతానని కాబోయే పెళ్శి కొడుకు ప్రకటించాడు. ఎన్టీఆర్, లక్ష్మిప్రణతిల వివాహ లఘ్నపత్రిక వేడుక ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. వధువు తండ్రి నార్నే శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన ఈ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందరేశ్వరి సహా రెండు కుటుంబాల దగ్గరి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హరికృష్ణ విలేకరులతో మాట్లాడుతూ 'మే 5న ఎన్టీఆర్, ప్రణతిల వివాహం జరపాలని ఇరుకుటుంబాల సమక్షంలో లఘ్నపత్రిక రాసుకున్నాం. వివాహ సమయం, వేదిక తదితర వివరాలు ఇంకా ఖరారు కాలేదు. మా ఇంట్లో శుభకార్యానికి అందరూ ఆహ్వానితులే. నందమూరి అభిమానులు, ఆత్మీయుల సమక్షంలో పెళ్శిని అంగరంగ వైభవంగా జరుపుతామన్నారు.

ఇది ఇలాఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వైజయంతీ బేనరులో ఆయన నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'శక్తి". జూనియర్ ఎన్టీఆర్ 'శక్తి"వంతమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మెహర్మ్రేష్ దర్శకుడు. మెహర్ గతంలో ఇదే బేనరులో 'కంత్రి"ని, మరో బేనరులో 'బిల్లా"ని తెరకెక్కించి అగ్ర దర్శకుల వరుసలో చేరిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన దర్శకత్వంలో అత్యున్నత సాంకేతిక విలువలతో, కోట్ల రూపాయలు వెచ్చించి తమ బేనరులో మహా'శక్తి"గా ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు అశ్వనీదత్.

మన దేశంలోని పలు అందమైన ప్రదేశాలతో పాటు, ఈజిప్ట్, లండన్, దుబాయ్ వంటి పలు ఇతర దేశాల్లో 13 నెలల పాటు శ్రమించి, ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. తొమ్మిది సంవత్సరాల పిల్లల నుంచి తొంభైఏళ్ల పెద్దవారి వరకు అలరించే విధంగా ఈ సినిమా ఉండాలన్నదే ధ్యేయంగా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

'శక్తి" చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను తొలిసారిగా ఆదివారం మీడియాకు విడుదల చేశారు దర్శక, నిర్మాతలు. మార్చి 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని ఈ సందర్భంగా సి.అశ్వనీదత్ వెల్లడించారు.

English summary
Young Tiger Jr NTR and Ileana’s upcoming film ’Shakti’ is directed by Meher Ramesh of ‘Kantri’ and ‘Billa’ fame and produced by Ashwini Dutt under Vyjayanthi Movies banner. The movie will be released in summer 2011 in the month of April. We knew from the sources that the unit is planning to release Shakti on March 30th 2011. Bollywood figures Jackie Shroff, Pooja Bedi and Sonu Sood are doing important roles in this movie. This film music director by Mani Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu