»   » జూ ఎన్టీఆర్ 'శక్తి' చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

జూ ఎన్టీఆర్ 'శక్తి' చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'శక్తి' చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ రాజస్థాన్ లోని జైపూర్ లో కీలకమైన షెడ్యూల్ ను 300 మంది యూనిట్ సభ్యులతో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంది. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో ఒక పాట, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసిన తర్వాత ధర్డ్ షెడ్యూల్ ని జమ్ము కాశ్మీర్ లోని లఢక్ ప్రాంతంలో షూట్ చేయనున్నారు, కొద్ది నెలలుగా మంచు తో బ్లాక్ అయిన ఆ ప్రాతం జూన్ నాటికి అనువుగా తయారవుతుంది. ఇక ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీగా తెరకెక్కుతోందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో ఈ చిత్రం భారీగా ఉంటుందని తెలుస్తోంది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం తన కెరీర్ లోనే సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోటప్రసాద్, డి.ఎస్.కన్నన్ రచనా సహకారం, సత్యానంద్ మాటలు, పాటలు...సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమీరా రెడ్డ్ కెమెరా వర్క్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu