For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్లో ఇదే ఫస్ట్: నాని కోసం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడో తెలుసా?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో పాటలు పాడటం ఇప్పుడు కొత్తేమీ కాదు. తెలుగులో చాలా మంది హీరోలు తమ తమ సినిమాలకు పాటలు పాడారు. ఇక తమిళంలో అయితే ఇతర హీరోల సినిమాలకు కూడా కొందరు హీరోలు పాటలు పాడటం చూస్తున్నాం.

  శింబు అయితే పొరుగు ఇండస్ట్రీ అయిన తెలుగులో కూడా తన ఫ్రెండ్స్ కోసం పాడారు. మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్, ఎన్టీఆర్ సినిమాలు తన గాత్రం అందించిన సంగతి తెలిసిందే. ధనుష్ కూడా ఇటీవల సాయిధరమ్ తేజ్ మూవీ 'తిక్క' చిత్రానకి టైటిల్ సాంగ్ పాడారు.

  తెలుగులో మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఇతర హీరోల సినిమాలకు పాడారు. తన సినిమాల్లో చారి, రాకాసి, ఐ వాన్న ఫాల యు లాంటి పాటలతో పాటు కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం కూడా ఓ పాట పాడారు. ఎన్టీఆర్ పాట ఆ సినిమాలో బాగా ఫేమస్ అయింది.

  ఎన్టీఆర్ పాట నాని కోసం

  ఎన్టీఆర్ పాట నాని కోసం

  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరోసారి ఇతర హీరో సినిమా కోస పాడబోతున్నాడని, అది కూడా తెలుగు హీరో నాని సినిమాకు పాడుతున్నాడని తెలుస్తోంది. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘నేను లోకల్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ,, ఎన్టీఆర్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండటంతో నాని సినిమాకు పాడటానికి ఒప్పుకున్నారట.

  పాటలు బాగా పాపులర్ అయ్యాయి

  పాటలు బాగా పాపులర్ అయ్యాయి

  ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ పాడిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆయన తన సినిమాల కోసం తెలుగులో పాడిన పాటలతో పాటు.....కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సినిమా కోసం పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంటుతోనే నాని సినిమాలో పాడిస్తున్నట్లు తెలుస్తోంది.

  దిల్ రాజు, నాని కాంబినేషన్ మూవీ ‘నేను లోకల్

  దిల్ రాజు, నాని కాంబినేషన్ మూవీ ‘నేను లోకల్

  వరుస విజయాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నాచురల్ స్టార్ నాని హీరో గా, నిర్మాత గా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి "నేను లోకల్" టైటిల్ ను ఖరారు చేసారు. కాప్షన్ "ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్".

  త్రినాథ రావు డైరెక్షన్, కీర్తి సురేష్ హీరోయిన్

  త్రినాథ రావు డైరెక్షన్, కీర్తి సురేష్ హీరోయిన్

  "సినిమా చూపిస్తా మామా" చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. నేను శైలజా సినిమా తో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ఈ చిత్రానికి హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తారు.

  ఆ మధ్య సినిమా ప్రారంభోత్సవంలో

  ఆ మధ్య సినిమా ప్రారంభోత్సవంలో

  హీరో నాని మాట్లాడుతూ, " రియల్ లైఫ్ ఎంతో డ్రమాటిక్ గా జరుగుతోంది. ఒక చిత్రం 50 డేస్ పూర్తి చేసుకుంది. ఒకటి విడుదలకు సిద్ధం అవుతోంది. మరొకటి ఇవాళ ప్రారంభం అయింది. కొన్ని కథలు చూసి ఎంజాయ్ చేస్తాం. ఈ కథ మాత్రం వింటూనే ఎంజాయ్ చేశాను. దిల్ రాజు గారి కి నాకు వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవుతుంది. ఆయన తో పని చేయటం ఆనందం గా ఉంది. దర్శకులు త్రినాధ్ గారు చాలా బాగా తీస్తారు అనుకుంటున్నా. కీర్తి సురేష్ మా సినిమా లో హీరోయిన్ గా చేస్తోంది. ఆమె చేసిన రజిని మురుగన్ సినిమా చాలా నచ్చింది. తాను ఈ సినిమా లో రోల్ కి పర్ఫెక్ట్ అనిపించింది. హీరో గా సినిమాలు చేస్తోన్న నవీన్ చంద్ర ఈ సినిమా లోఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్. మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది", అని అన్నారు.

  ఇష్టాలు ఈ చిత్రం తో తీరుతున్నాయి

  ఇష్టాలు ఈ చిత్రం తో తీరుతున్నాయి

  దర్శకులు త్రినాథ రావు మాట్లాడుతూ , " నాకు ఉన్న చాలా ఇష్టాలు ఈ చిత్రం తో తీరుతున్నాయి. దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నా. హీరో నాని ఒక నాచురల్ యాక్టర్ . ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఈ కోరికలన్నీ ఈ చిత్రం తో తీర్చుకుంటున్నా. కథ లో మంచి ఎనర్జీ ఉంటుంది. మీ ముందుకు ఒక మంచి లవ్ ఎంటర్టైనర్ తో వస్తాం", అన్నారు

  టెక్నీషియన్స్

  టెక్నీషియన్స్

  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్ప్లే - మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, స్క్రీన్ప్లే - దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, సమర్పణ : దిల్ రాజు

  English summary
  After crooning for chartbuster songs like 'Chari', 'Raakasi', 'I Wanna Follow you' and others, he sang a song in Kannada too titled 'Gelaya' in Kannada star Puneeth Rajkumar's 'Chakravyuha'. Now, reports suggest that NTR once again will be singing for Nani's film 'Nenu Local'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X