»   » సింహాద్రితో సిక్స్ కొట్టా, డకౌట్లు అయ్యా, బయోపిక్ అంటే భయం: ఐపీఎల్ ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్

సింహాద్రితో సిక్స్ కొట్టా, డకౌట్లు అయ్యా, బయోపిక్ అంటే భయం: ఐపీఎల్ ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్‌మాలో ప్రసారం అయ్యే ఐపీఎల్ తెలుగు వెర్షన్‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో స్టార్ మా ప్రతినిధులతో కలిసి ఎన్టీఆర్ మంగళవారం పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో క్రికెట్ క్రీడకు సినిమా భాష జతచేసి ఆసక్తికరంగా మాట్లాడారు. క్రికెట్లో మాదిరిగానే సినిమాల్లో కూడా డకౌట్లు, సిక్సులు ఉంటాయన్నారు.

Jr NTR As Brand Ambassador For IPL Telugu
సింహాద్రితో సిక్స్, డకౌట్లు కూడా అయ్యాను

సింహాద్రితో సిక్స్, డకౌట్లు కూడా అయ్యాను

‘సింహాద్రి సినిమా పెద్ద హిట్ కాగానే తనకు సిక్స్ కొట్టినట్లు అనిపించిందని, సినిమాల్లో డకౌట్లయిన సందర్భాలు కూడా ఉన్నాయని, సినిమాల్లో అయినా, క్రికెట్లో అయినా గెలుపు, ఓటములు సర్వసాధారణమేనని' ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఫేవరెట్ క్రికెటర్ సచిన్

ఫేవరెట్ క్రికెటర్ సచిన్

మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ.... స‌చిన్ టెండూల్క‌ర్ అని తెలిపారు. ఎంతో మంది గొప్ప క్రికెటర్లు ఉన్నారు, సచిన్ పేరు చెప్పి వారిని తక్కువ చేయడం లేదు, తనకు క్రికెట్ గురించి అవగాహన వస్తోన్న వయసులో సచిన్ టెండూల్కర్ మాత్రమే తెలుసని, ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇష్టమే అన్నారు ఎన్టీఆర్.

తెలుగులో మజా ఉంటుంది

తెలుగులో మజా ఉంటుంది

'ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైనందుకు, తెలుగులో స్టార్ మాతో అసోసియేషన్ అయినందుకు సంతోషంగా ఉంది. దీనిని ఒక కుటుంబం లాగా భావిస్తున్నా. ఐపీఎల్ తెలుగులో చూడటంలోనే అసలు మాజా ఉంటుంది' అని ఎన్టీఆర్ అన్నారు.

మన రక్తంలోనే ఉంది

మన రక్తంలోనే ఉంది

క్రికెట్‌ మన రక్తంలో ఉంది, నరనరాల్లో ఉంది. ఆస్తి లాగా పెద్దలు పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారు. మా నాన్న క్రికెట్ చూడటం వల్ల నేను దానిపై ఇష్టాన్ని పెంచుకున్నాను అన్నారు. తన కుమారుడు క్రికెటర్ కావాలో లేక ఎటువైపు వెళ్లాలో తాను నిర్ణయించబోనని, పెద్దయిన తర్వాత తనే నిర్ణయించుకుంటాడని మరో ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు.

క్రికెటర్ బయోపిక్ చేసేంత ధైర్యం నాకు లేదు

క్రికెటర్ బయోపిక్ చేసేంత ధైర్యం నాకు లేదు

సినిమాల్లో ఈ మధ్య బయోపిక్‌ల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో విలేకరుల నుండి ఎన్టీఆర్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. క్రికెటర్ బయోపిక్ చేయాల్సి వస్తే ఎవరిది చేస్తారు? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ తెలివిగా సమాధానం ఇచ్చారు. బయోపిక్ చేయడం అంటే నాకు భయం. నేను సాధారణ నటుడిని, సినిమా హీరోను. క్రికెటర్ అంటే నేషనల్ హీరో. అలాంటి గొప్ప వ్యక్తుల పాత్రలు చేసేంత దైర్యం నాకు లేదు... అని ఎన్టీఆర్ అన్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ గురించి

ఎన్టీఆర్ బయోపిక్ గురించి

బయోపిక్ టాపిక్ రావడంతో వెంటనే ఎన్టీఆర్‌కు తన తాత రామారావు మీద వస్తున్న బయోపిక్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఇందులో మీరు నటిస్తున్నారా? అనే ప్రశ్నకు ‘ఈ సినిమా గురించి తనను ఎవరూ సంప్రదించలేదు. ఒక వేళ అవకాశం వస్తే మీడియా వారికి చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను' అని ఎన్టీఆర్ అన్నారు.

 ఆర్ఆర్ఆర్ మూవీ గురించి తొలిసారి

ఆర్ఆర్ఆర్ మూవీ గురించి తొలిసారి

ఐపీఎల్ నుండి క్రమక్రమంగా టాపిక్ ఎన్టీఆర్ సినిమాల వైపు మళ్లింది. కొందరు మీడియా ప్రతినిధులు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ చేయబోతున్న ‘ఆర్ఆర్ఆర్' మూవీ గురించి అడిగారు. తనకు రాజమౌళి ఇంకా పూర్తి కథ చెప్పలేదని, ఆయన మొత్తం కథ చెప్పే వరకు నేను కూడా ఏమీ మాట్లాడటానికి లేదు అని ఎన్టీఆర్ అన్నారు.

ఆరోగ్యవంతమైన పోటీ

ఆరోగ్యవంతమైన పోటీ

‘ఆర్ఆర్ఆర్' మూవీ మా ముగ్గురి మధ్య ఆరోగ్యవంతమైన పోటీ. మంచి సినిమా అవుతుంది అని ఎన్టీఆర్ అన్నారు. ఇలా చెప్పడం ద్వారా రామ్ చరణ్, తనకు మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉందని చెప్పకనే చెప్పారు ఎన్టీఆర్.

ఐపీఎల్ తెలుగు యాడ్

ఎన్టీఆర్ నటించిన ఐపీఎల్ తెలుగు యాడ్ ఇదే. ఈ యాడ్ చూస్తే మీకూ తెలుగులోనే ఐపీఎల్ చూడాలనే కోరిక కలగడం ఖాయం.

English summary
South Indian actor Jr NTR at VIVO IPL 2018 press meet which held in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X