»   » మహేష్ పై జూ ఎన్టీఆర్ స్వీట్ రివేంజ్

మహేష్ పై జూ ఎన్టీఆర్ స్వీట్ రివేంజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టీ మరో పెద్ద చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' పైనే ఉంది. ఈ చిత్రం దశరాకు టార్గెట్ చేసారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కొత్త కామెడీ ట్రైలర్ ని వదిలారు. ఆ ట్రైలర్ లో మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లోని టైటిల్ సాంగ్ ని కామెడీ చేసారు ఎన్టీఆర్. గతంలో మహేష్ సూపర్ హిట్ దూకుడులో యమదొంగలోని ఎన్టీఆర్ డైలాగ్ ని కామెడీ చేసారు. అందుకే ఇలా ఈ చిత్రంలో చేసారని, స్వీట్ రివేంజ్ తీర్చుకున్నాడని చెప్తున్నారు.

ఇక తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో పరిస్థితులు చేజారి పోయాయి. సీమాంధ్రలో ఉద్యమాల కారణంగా విద్యుత్, రవాణాతోపాటు ఇతర రంగాల్లో కూడా సంక్షోభాలు నెలకొన్నాయి. గత 70 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమ ప్రబావం ఉవ్వెత్తున్న ఉన్న కారణంగా టాలీవుడ్ లో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన భారీ బడ్జెట్, అగ్ర నటుల చిత్రాలు వాయిదా పడ్డాయి.సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వాయిదాకు నోచుకోని అత్తారింటికి దారేది? చిత్రం లీక్ అయిందన్న వార్తలతో కొంత సానుభూతిని మూటకట్టుకొని ఉద్యమ సెగను దాటేసి.. ప్రేక్షకుల వద్దకు చేరుకుంది. అయితే అత్తారింటికి దారేది విడుదలకు పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో మిగితా భారీ బడ్జెట్ చిత్రాలు రామయ్యా వస్తావయ్యా.. ఎవడు చిత్రాలకు పెద్దగా అడ్డంకులు ఉండవని చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ఊహించని రీతీలో తెలంగాణపై కేంద్రం అడ్డగోలు నిర్ణయం తీసుకోవడంతో పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యలో అక్టోబర్ 10 తేదిన విడదలయ్యే రామయ్యా వస్తావయ్యా చిత్ర విడుదలపై మళ్లీ సందేహాలు నెలకొన్నాయి.

'గబ్బర్‌సింగ్‌' తరవాత హరీష్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. కాబట్టి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తమన్‌ అందించిన పాటలు, కట్‌ చేసిన ట్రైలర్‌ ఈ సినిమాపై పెట్టుకొన్న ఆశల్ని రెట్టింపు చేశాయి. ''మీరు ఎన్ని అంచనాలు పెట్టుకొనైనా థియేటర్లకు రండి. సినిమా చూశాక అందరూ 'ఇది సూపర్‌హిట్‌' అంటారు. ఆ గ్యారెంటీ నాది..'' అని నిర్మాత దిల్‌రాజు కూడా భరోసా ఇస్తున్నారు.

English summary
The new trailer of NTR Jr's forthcoming film Ramayya Vasthavayya has the actor poking fun at Mahesh Babu. NTR apparently was trying to pull the leg of Mahesh Babu and Venkatesh by mocking a famous number from the film Seethamma Vaakitlo Sirimalle Chettu (SVSC).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu