twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ. ఎన్టీఆర్ తండ్రి అవుతున్నారు..ఇదిగో సాక్ష్యం (ఫొటో)

    By Srikanya
    |

    jr. NTR wife with baby bump!!
    హైదరాబాద్ :ప్రముఖ సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సందర్బంగా ఆయన భార్య లక్ష్మీ ప్రణతి..గర్బవతి అనే విషయం అందరినీ ఆకర్షించింది. ఎన్టీఆర్ సైతం అక్కడ అధికారులను రిక్వెస్ట్ చేసి, ఆమెకు ఫ్రిఫెరెన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఆమె కడుపు ఎత్తుగా ఉండటంతో ఆ మధ్యన ఎన్టీఆర్ తండ్రి అవుతున్నారంటూ వచ్చిన వార్తలు నిజమే అని తేల్చినట్లు అయ్యాయి.

    సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ఎన్టీఆర్, కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ మధ్యన కొంతకాలం షూటింగ్ గ్యాప్ వచ్చిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మళ్లీ కంటిన్యూగా జరగనుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి 'రభస' అనే పేరు పరిశీలనలో ఉంది. బెల్లకొండ సురేష్‌ నిర్మాత. సమంత, ప్రణీత హీరోయిన్స్.

    బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.... ' ఆ కుర్రాడికి దూకుడెక్కువ. మాటల్తో మడతెట్టేస్తాడు. చేతలతో పడగొట్టేస్తుంటాడు. తేడా వస్తే.. రభస చేయడానికి రెడీ అంటాడు. మరి ఆ జోరు ఎలా ఉంటుందో చూడాలంటే.. మా సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. 'ఆది' తరవాత ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులకు నచ్చేలా ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా తీర్చిదిద్దుతున్నాం. మా సంస్థలో ఇది మరపురాని చిత్రం అవుతుంది'' అని చెబుతున్నారు.

    దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

    ఇక... ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    NTR came to the polling booth in Obul Reddy High School along with his mother Shalini and wife Lakshmi Pranathi . His wife Lakshmi Pranathi accompanied him to vote and she seems to be pregnant. The baby bump is clearly visible.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X