twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉమామహేశ్వరిది ఆత్మహత్యే.. ఆమె మరణం కారణం అదే.. పోస్టుమార్టం రిపోర్టు‌లో సంచలన విషయాలు!

    |

    దివంగత మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని ఆమె పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. అయితే ఇది మిస్టరీ మరణం అంటూ పెద్ద ఎత్తున రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు పోస్టుమార్టం నివేదిక అందినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

     ఆత్మహత్య చేసుకుని

    ఆత్మహత్య చేసుకుని

    ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావుకి 12 మంది సంతానం. అందులో ఎనిమిది మంది మగ పిల్లలు కాగా నలుగురు ఆడపిల్లలు. నలుగురు ఆడపిల్లలలో కూడా ఉమామహేశ్వరి చిన్న సంతానం. అందరికంటే చిన్న కుమార్తె కావడంతో ఆమె మీద అందరికీ ప్రేమ ఎక్కువగా ఉండేది. గత కొన్నాళ్లుగా హైదరాబాదులోనే నివాసం ఉంటున్న ఆమె అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా డిప్రెషన్కు లోనైన ఆమె ఆగస్టు ఒకటో తేదీన ఆత్మహత్య చేసుకుని మరణించారు.

    పోస్టుమార్టం నివేదిక

    పోస్టుమార్టం నివేదిక

    అయితే కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమె శరీరాన్ని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం జరిగిన తర్వాత కుటుంబానికి పార్థివదేహాన్ని అప్పగించారు కానీ పోస్టుమార్టం నివేదిక ఇంకా బయటకు రాలేదు ఎట్టకేలకు ఈ పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందినట్లు తెలుస్తోంది.

    ఉరి వేసుకుని

    ఉరి వేసుకుని

    ఉస్మానియా మార్చురీ నుంచి కంఠమనేని ఉమా మహేశ్వరి పోస్టు మార్టం నివేదికను జూబ్లీహిల్స్ పోలీసులకు ఉస్మానియా ఫోరెన్సిక్ సైన్స్ వైద్యులు అందజేసినట్టు తెలుస్తోంది. ఇక ఉమా మహేశ్వరి సూసైడ్ కి పాల్పడినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు నిర్ధారించారని అంటున్నారు. ఉమా మహేశ్వరి తనకు తాను ఉరి వేసుకుని చనిపోయినట్టు ఈ పోస్టుమార్టం రిపోర్ట్.లో ఉందని అంటున్నారు. ఉమామహేశ్వరి మెడ భాగంలో ఉన్న స్వర పేటిక బ్రేక్ అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు స్పష్టం చేశారని చెబుతున్నారు.

    రాజకీయ దుమారం

    రాజకీయ దుమారం

    నిజానికి ఆమె ఈ నెల 1 న తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇక తన తల్లి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో తన తండ్రితో పాటు.. తన భర్త కూడా ఉన్నట్లు ఉమామహేశ్వరి చిన్న కుమార్తె దీక్షిత వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై ఏపీలో రాజకీయ దుమారం కూడా రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది.

    సతీసమేతంగా

    సతీసమేతంగా


    ఇక ఆమె మరించిన సమయంలో విదేశాలలో పెద్ద కుమార్తె ఉండడంతో ఆమె ఇండియా తిరిగి వచ్చేవరకు ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని భద్ర పరిచారు. ఎన్ఠీఆర్ కూడా అప్పుడు విదేశీ పర్యటనలో ఉండడంతో ఆయన కూడా తన మేనత్త చివరి చూపు నోచుకోలేక పోయారు. అయితే హైదరాబాద్ తిరిగి వచ్చిన ఎన్టీఆర్ సతీసమేతంగా మేనత్త నివాసానికి వెళ్లి అక్కడ తన మామ మరదళ్లకు నేనున్నానని అభయం ఇచ్చినట్టు సమాచారం.

    English summary
    Jubilee hills police received Umamaheshwari Postmortom report in suspicious death case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X